పైకి స్పా... లోపల సెక్స్ రాకెట్... ఆటకట్టించిన పోలీసులు

Maharashtra : మెట్రో సిటీలుగా మారుతున్న నగరాల్లో... వ్యభిచార దందాలు తెరవనక నడుస్తున్నాయి. వాటిని కంట్రోల్ చెయ్యడం పోలీసుల వల్ల కావట్లేదా?

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 1:47 PM IST
పైకి స్పా... లోపల సెక్స్ రాకెట్... ఆటకట్టించిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పుణెలోని ఓ మాల్‌ లోపల పుణ్యత్ స్పా సెంటర్‌లో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని తెలియడంతో... చెకప్ కోసం పోలీసులు అక్కడకు వెళ్లారు. పోలీసుల్ని చూడగానే... మొదట బయపడిన స్పా సెంటర్ మేనేజర్... ఏమీ ఎరగనట్టు నటిస్తూ... ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు... మసాజ్ ఏదైనా చెయ్యమంటారా అని అడిగారు. మీతో మాటలేంటి... రైడ్... అని ఎస్సై అనడంతో... కానిస్టేబుళ్లు... చకచకా లోపలికి వెళ్లిపోయారు. సార్... సార్... ఇలా రండి సార్... చిన్న మాట అని మేనేజర్ ఏదో చెప్పబోతుంటే... ఎస్సై... షటప్... కీప్ క్వైట్ అని ఆర్డరేశారు. పైకి అది చిన్న స్పాలాగా ఉన్నా... లోపల చాలా పెద్దదే ఉంది. సెపరేట్ ఏసీ గదులతో చిన్నపాటి రాజదర్బార్‌లా ఉంది. పోలీసులు... ఆ గదులను తెరిపించి... మొత్తం ఐదుగురు విదేశీ యువతుల్ని (అందరూ థాయ్‌లాండ్ వాళ్లే) రక్షించి... కొందరు విటులను, మేనేజర్‌నూ అరెస్టు చేశారు. ఈ రైడ్‌లో రూ.12800 స్వాధీనం చేసుకున్నారు.

8 నెలల కిందట పోలీసులు ఇదే స్పాపై రైడింగ్ చేశారు. అప్పట్లో ఇలాగే జరిగితే స్పాని మూసి వేశారు. రెండు నెలల తర్వాత అది వేరే పేరుతో మళ్లీ తెరచుకుంది. థాయ్‌ల్యాండ్‌కి చెందిన ఆ యువతులు టూరిస్ట్ వీసాతో ఇండియా వచ్చారు. వారిని బలవంతంగా సెక్స్ రాకెట్‌లోకి దింపినట్లు దర్యాప్తులో తెలిసింది. వాళ్లను రెస్క్యూ హోమ్‌కి తరలించిన పోలీసులు... దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు