పైకి కేరళ మసాజ్ సెంటర్... లోపలికి వెళితే వ్యభిచార దందా...

తమిళనాడు రాష్ట్రంలోని వేలూర్‌లో వెలుగుచూసిన వ్యభిచార దందా... వెరైటీ మసాజ్‌ల పేరిట అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న కేరళ యువకుడు అరెస్ట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 10, 2019, 4:30 PM IST
పైకి కేరళ మసాజ్ సెంటర్... లోపలికి వెళితే వ్యభిచార దందా...
పైకి కేరళ మసాజ్ సెంటర్... లోపలికి వెళితే వ్యభిచార దందా...
  • Share this:
అదో మసాజ్ సెంటర్. కేరళ పద్ధతుల్లో మసాజ్ చేస్తామంటూ బయట బోర్డు కనిపిస్తుంది. అయితే లోపలికి వెళితే సీన్ మొత్తం వేరేగా ఉంటుంది. వివిధ రకాల మసాజ్‌ల పేరుతో వ్యభిచార దందా సాగుతోంది. కేరళ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోన్న ముఠా గుట్టును రట్టుచేశారు తమిళనాడు పోలీసులు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూర్‌లో ‘కేరళ మసాజ్ సెంటర్’ పేరుతో ఓ ఆయుర్వేద స్పా సెంటర్ ఏర్పాటుచేశాడు కేరళకు చెందిన షబీక్ అనే 28 ఏళ్ల యువకుడు. కోసపటనల్లాన్ పేట గ్రామంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని కొన్నిరోజుల నిర్వహిస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా ఈ మసాజ్ సెంటర్‌కు వచ్చే పురుషుల సంఖ్య భారీగా పెరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం మసాజ్ సెంటర్‌కు వచ్చే యువకుల సంఖ్య భారీగా ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... మసాజ్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేశారు. లోపల కనిపించిన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యారు.

ఆరుగురు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న షబీక్... మసాజ్ కోసం వచ్చిన వారికి న్యూడ్ మసాజ్, సెమీ న్యూడ్ మసాజ్, సెక్సువల్ మసాజ్ పేరుతో రకరకాల ధరలు నిర్ణయించాడు. ఇవి కాకుండా కేవలం మసాజ్ కోసం వచ్చేవారిని కూడా మత్తులోకి దించి, అమ్మాయిలతో నీచమైన పనులు చేయించేవాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... షబీక్‌ను అదుపులోకి తీసుకుని, మసాజ్ సెంటర్‌లో పనిచేస్తున్న యువతులకు విముక్తి కల్పించారు.
First published: May 10, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading