విద్యార్థినులపై లైంగిక వేధింపులు... కీచక ప్రొఫెసర్ అరెస్ట్

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 3:38 PM IST
విద్యార్థినులపై లైంగిక వేధింపులు... కీచక ప్రొఫెసర్ అరెస్ట్
సూర్య రాఘవేంద్ర(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 18, 2019, 3:38 PM IST
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినుల సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ, వారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రాఘవేంద్రపై పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్‌ పోలీసు స్టేషనుకు చెందిన మహిళ ఎస్సై శ్రావణి కృష్ణా జిల్లా నందిగామలోని అతని స్వగృహంలో నిందితుడిని అరెస్టు చేశారు.

అనంతరం అతడిని రాజమండ్రి తరలించారు. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారన్నారని పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర వేధింపులు తట్టుకోలేకపోయిన పలువురు విద్యార్థినులు... ఈ వ్యవహారంపై ఏకంగా సీఎం జగన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల లేఖపై స్పందించిన సీఎం జగన్... ఘటనపై విచారణకు ఆదేశించారు.


First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...