ఓ నిర్మాత ప్రముఖ హోటల్లో పార్క్ చేసిన ఖరీదైన కారు కనిపించకుండా పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరుకు చెందిన వి మంజునాథ్ వ్యాపారవేత్తగా కొనసాగుతూ సినిమాలు నిర్మిస్తున్నాడు. అతడు ఇటీవల బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు వచ్చాడు. మంజునాథ్‌ను హోటల్ వద్ద డ్రాప్ చేసిన డ్రైవర్ హర్ష.. అతని సిల్వర్ కలర్ ఎస్యూవీ వాహనాన్ని బేస్మేంట్-2లో పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేశాడు. అయితే మరుసటి రోజు డ్రైవర్ కారు కోసం బేస్మేంట్-2కి వెళ్లాడు. అయితే తాను పార్క్ చేసిన చోట కారు కనిపించలేదు. దీంతో కంగారు పడిపోయిన అతడు పార్కింగ్ ఏరియాలో వెతకడంతో పాటుగా, అక్కడి సిబ్బందిని కూడా ఆరా తీశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు వెంటనే మంజునాథ్‌కు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మంజునాథ్ డ్రైవర్‌తో కలిసి కారు కోసం మరోసారి వెతకడం ప్రారంభించాడు. అయినా కారు ఆచూకీ లభించలేదు.
దీంతో మంజునాథ్ పోలీసులను ఆశ్రయించాడు. పార్క్ హయత్‌లో పార్క్ చేసిన తన కారు చోరికి గురైనట్టు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కారులో నాలుగు చెక్ బుక్‌లు, లైసెన్స్ వెపన్ డాక్యూమెంట్స్, బంగారంతో చేసిన వినాయకుడి విగ్రహం, భూమి పత్రాలు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని మంజునాథ్ పేర్కొన్నారు.
ఇక, మంజునాథ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కారును కనిపెట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హోటల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రముఖ హోటల్లో పార్క్ చేసిన ఖరీదైన కారు కనిపించకుండా పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.