Home /News /crime /

PRIYANKA REDDY MURDER CASE HERE IS COMPLETE TIMELINE IN PRIYANKA CASE SK

షాద్ నగర్ మర్డర్ కేసులో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? పూర్తి టైమ్ లైన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా పథకం ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

    వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఆమెను రేప్ చేసి చంపేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా పథకం ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుకు అప్పగించారని తెలిపారు. నిందితులకు త్వరగా కఠిన శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు.

    నిందితుల వివరాలు:
    A1- మహ్మద్ అలియాస్ ఆరిఫ్ (26), లారీ డ్రైవర్- నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్
    A2- జొల్లు శివ (20), లారీ క్లీనర్- నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల
    A3- జొల్లు నవీన్ (20), లారీ క్లీనర్- మక్తల్ మండలం గుడిగండ్ల
    A4- చింతకుంట చెన్నకేశవులు (20), లారీ డ్రైవర్- నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల

    ప్రియాంక కేసులో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది?

    05.50: నక్షత్ర కాలనీలోని ఇంటి నుంచి ప్రియాంక రెడ్డి బయలు దేరింది.

    06.08: తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద బైక్ పార్క్ చేస్తే సిబ్బంది వద్దని చెప్పారు.

    06.18: తొండుపల్లి గేట్ సమీపంలో రోడ్డు పక్కన బైక్‌ని పార్క్ చేసింది.

    09.13: గచ్చిబౌలి నుంచి తిరిగి తొండుపల్లి టోల్‌ప్లాజాకు ప్రియాంక వచ్చింది

    09.19: బైక్ పంక్చర్ అయిందని చెల్లికి ప్రియాంక ఫోన్ చేసింది

    09.23: ఏ2 శివ స్కూటీకి పంక్చర్ వేయించుకొస్తానని తీసుకెళ్లాడు

    09.30: షాప్‌లు క్లోజ్ ఉన్నాయని తిరిగొచ్చిన శివ మళ్లీ స్కూటీ తీసుకెళ్లాడు

    09.35: బైక్‌లో గాలి కొట్టించుకొని శివ తిరిగి అక్కడకు చేరుకున్నాడు

    09.48: ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచాఫ్ అయింది

    10.08: నలుగురూ కలిసి ప్రియాంకను రేప్ చేసి హత్య చేశారు

    10.28: మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో పెట్టారు. అనంతరం ముందు స్కూటీ బయలుదేరింది

    10.33: ఆ తర్వాత టూ వీలర్ వెనకాల లారీ బయలు దేరింది

    అర్ధరాత్రి1: నందిగామలో బైక్‌ను ఓ చోట పార్క్ చేసి నడచుకుంటూ వెళ్లారు. ఎస్ఆర్ బంక్‌లో బాటిల్‌తో పెట్రోల్ కొనేందుకు వెళ్లారు. బాటిల్‌లో వాళ్లు పెట్రోల్ పోయలేదు. ఆ తర్వాత జేఎస్ బంకులో పెట్రోల్ తీసుకున్నారు

    02.00-02.30: షాద్‌నగర్ శివారులో మృతదేహాన్ని తగులబెట్టారు. అనంతరం స్కూటీని కొత్తూరు సమీపంలో వదిలేసి లారీలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Priyanka Reddy, Priyanka reddy murder, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు