ఓ ఆడపిల్ల తండ్రిగా అభ్యర్థిస్తున్నా... షాద్ నగర్ బాధితురాలి తండ్రి విజ్ఞప్తి...

ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: November 30, 2019, 3:50 PM IST
ఓ ఆడపిల్ల తండ్రిగా అభ్యర్థిస్తున్నా... షాద్ నగర్ బాధితురాలి తండ్రి విజ్ఞప్తి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తండ్రి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టులో నిందితుల తరపున ఏ న్యాయవాది వాదించవద్దని కోరారు. ‘ఓ ఆడపిల్ల తండ్రిగా అభ్యర్థిస్తున్నా. సమాజంలో జరిగే నేరాలపై అవగాహన లేకే నా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. మరో ఆడపిల్లకు ఇలాంటి సంఘటన జరుగకుండా యువతులకు పోలీసులు అవగాహన కల్పించాలి.’ అని శ్రీధర్ రెడ్డి కోరారు.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఆమెను రేప్ చేసి చంపేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. లారీలపై పని చేసే ఈ నలుగురూ పక్కా పథకం ప్రకారమే ప్రియాంక రెడ్డి ట్రాప్ చేసి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని.. అనంతరం దారుణంగా హత్య చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుకు అప్పగించారని తెలిపారు. నిందితులకు త్వరగా కఠిన శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు.

నిందితుల వివరాలు:

A1- మహ్మద్ అలియాస్ ఆరిఫ్ (26), లారీ డ్రైవర్- నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్


A2- జొల్లు శివ (20), లారీ క్లీనర్- నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల
A3- జొల్లు నవీన్ (20), లారీ క్లీనర్- మక్తల్ మండలం గుడిగండ్ల

A4- చింతకుంట చెన్నకేశవులు (20), లారీ డ్రైవర్- నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల

 
First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>