PRIYANKA RAPE CASE ACCUSE MOHAMMAD MOTHER WORDS ABOUT HER SON HERE ARE THE DETAILS MK
నా కొడుకును నడిరోడ్డు మీద ఉరితీయండి...రేపిస్టు తల్లి ఆక్రోషం...
ప్రతీకాత్మకచిత్రం
నిందితుడు మహ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ నిందితుడి తల్లి పేర్కొనడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి శివారులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుల్లో మహ్మద్ పాషాతో పాటు మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. అయితే నిందితుల్లో ఒకరైన మహ్మద్ పాషా నారాయణ్ పేట్ జిల్లా, మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడు మహ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ నిందితుడి తల్లి పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఈ కేసును చేధించినట్లు తెలుస్తోంది.
హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మహ్మద్ పాషాతో పాటు జోల్లు శివ, నవీన్, చింతకుంట చెన్నకేశవులుగా గుర్తించారు. వీరంతా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు పురోగతిపై పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.