హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fraud Government jobs: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షల రూపాయలతో ఉడాయించిన టీచర్.. అసలేం జరిగిందంటే..

Fraud Government jobs: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షల రూపాయలతో ఉడాయించిన టీచర్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం (image-twitter)

ప్రతీకాత్మక చిత్రం (image-twitter)

Fake jobs: ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో పైరవీకారులు కొత్త దందాకు తెరతీశారు. తమకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగంపై ఆశతో కొందరు ఈ మోసగాళ్ల వలలో పడుతున్నారు.

ఇంకా చదవండి ...

  ప్రభుత్వ ఉద్యోగంలో జీతాలు తక్కువగా ఉన్నా ఆ ఉద్యోగమే కావాలని చాలా మంది కోరుకుంటారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సాధిస్తే ఉద్యోగ భద్రత ఉంటుందని భావించడమే ఇందుకు కారణం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై ప్రజలకు ఉన్న ఆసక్తిని అదునుగా తీసుకుని అనేక మంది లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బుల కడితే చాలు కొలువు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి రూ. కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇలాంటిదే మెదక్ జిల్లా కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసింది. మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేసింది. అక్కడ నుంచి చిన్నగా సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు తన మకాం మార్చింది.

  మెదక్ జిల్లాకు చెందిన యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈమెతో పాటు మరో ఇద్దరు కూడా ఆమెతో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపడతామన్నారు. వీరి వెనకాల ఎవరైనా రాజకీయ నాయకుల అస్త్రం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఆమె బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరం నుంచి ఎంత డబ్బు వచ్చింది ? ఆ డబ్బులను ఎవరి ఖాతాలకు జమ చేసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . దీని ద్వారా ఎంత మంది ఉన్నారనేది తెలుసుకోవడం సులువు అని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె మాయలో పడి ఉద్యోగ వస్తుందనే ఆశతో ఓ బాధితుడు ఆమెను డబ్బులు అడగగా మరికొందరికీ వేరే వ్యక్తులతో నంబర్లు ఇచ్చి వారితో మాట్లాడాలని ఆ యువతి సమాధానం ఇచ్చిందని తెలిపాడు. యువతి చేసిన మోసం లో ఒక పురుషుడు.. మరో మహిళ కీలకంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గతంలోనూ కొందరు తమ వద్దకు వచ్చి గోడును వెళ్లబోసుకున్నారు. ఫిర్యాదు ఇవ్వకుండా వెనుదిరిగి వెళ్లిపోయారని చిలిప్ చెడ్ పోలీసులు తెలిపారు.

  ప్రభుత్వ ఉద్యోగంపై ప్రజలకు ఉన్న ఆసక్తిని అదునుగా తీసుకుని అనేక మంది లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బుల కడితే చాలు కొలువు ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇటువంటి వారి మాటలు నమ్మోద్దని ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పిన యువత పెడచెవిన పెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల నెరవేరాలంటే ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన పరీక్ష రాసి అందులో మెరిట్ ఆధారంగా కొలువులను సాధించాలి. కానీ ఇలా దొడ్డి దారిన కొలువులను ప్రభుత్వం అమ్ముకోదనే విషయాలను యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Cheating, Crime news, Fraud women, Government jobs, Medak, Telangana, Tspsc jobs

  ఉత్తమ కథలు