హోమ్ /వార్తలు /క్రైమ్ /

చిత్తూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..ఒకరు మృతి..20 మందికి గాయాలు

చిత్తూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..ఒకరు మృతి..20 మందికి గాయాలు

చిత్తూరులో రోడ్డు ప్రమాదం

చిత్తూరులో రోడ్డు ప్రమాదం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. అతివేగం (Speed Driving), మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అయితే జరిగే ప్రమాదం ఒకటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో బాధిత కుటుంబాల్లో తీరని దుఃఖం చోటు చేసుకుంటుంది. ఇక తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన విజయ్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh | Chittoor

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. అతివేగం (Speed Driving), మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అయితే జరిగే ప్రమాదం ఒకటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో బాధిత కుటుంబాల్లో తీరని దుఃఖం చోటు చేసుకుంటుంది. ఇక తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన విజయ్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Firing in Hyderabad: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన వైనం.. వివరాలివే..

బెంగళూరు నుండి విజయవాడ వెళ్తుండగా..

ప్రైవేట్ ట్రావెల్స్ కు  బస్సు బెంగళూరు నుండి విజయవాడకు బయలుదేరింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పలమనేడు వద్దకు రాగానే బస్సు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను డీకోట్టింది. దీనితో బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో చూసేలోపే ప్రమాదం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో గుంటూరుకు చెందిన విజయ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడిఅక్కడే మృతి చెందాడు. అలాగే బస్సులో ఉన్న మరికొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు తేలుస్తుంది.

Mulugu: ఏజెన్సీలో కొనసాగుతున్న వేట.. నాలుగు రోజుల్లో 11 మంది అరెస్ట్..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్న ఆధార్ ఇతర డాకుమెంట్స్ తో విజయ్ గా గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం  ఇచ్చారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రమాదానికి కారణం అదేనా..

అయితే అప్పటివరకు అప్రమత్తంగానే డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కొద్దిసేపటికి నిద్రమత్తులోకి వెళ్ళిపోయాడు. కనురెప్పపాటులోనే బస్సు పక్కనే ఉన్న డివైడర్ ను ఢికొట్టింది. అప్పుడు నిద్ర నుండి తేరుకున్న లాభం లేకపోయింది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

First published:

Tags: Ap, AP News, Chittoor, Road accident, Road accidents

ఉత్తమ కథలు