Teacher raped student : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి(Teacher) బుద్ది వక్రమార్గం పట్టింది. భయపెట్టి పలుమార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కాలేజీకి వెళ్లి ఉన్నతచదువులు చదువుకోవాల్సిన విద్యార్థి టీచర్ చేసిన పనికి చిన్నవయస్సులోనే గర్భం(Pregnancy) దాల్చింది.చివరకు ఉపాధ్యాయుడి అసలు రంగు బయటపడింది. దీంతో ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కిస్దున్నాడు. బీహార్(Bihar)లోని మాధేపురాలో ఈ ఘటన జరిగింది.
బీహార్లోని మాధేపురాలో సదర్ సబ్-డివిజన్లోని గమ్హారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 16 ఏళ్ల మెట్రిక్యులేషన్ విద్యార్థి...రంజిత్ కుమార్(30)అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఇంట్లో ట్యూషన్ కి వెళ్లేది. అయితే గతేడాది హోలీ పండుగ సాకుతో ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్.. సాయంత్రం వేళ తన ఇంటికి పిలిచాడని, ఆ రోజు అతని ఇంట్లో ఎవరూ లేరని..ఆ సమయంలో టీచర్ తనని ఓ గదిలోకి తీసుకెళ్లి హోలీ ఆడుతున్నానంటూ అసభ్యకరమైన జోకులు వేయడం ప్రారంభించాడని బాధిత విద్యార్థిని తెలిపింది. అదే రోజు టీచర్ తనపై బలవంతంగా అత్యాచారం చేసి, తన సహచరుడితో కలిసి పూర్తిగా వీడియో తీశాడని తెలిపింది. ఈ విఫయం గురించి ఎక్కడైనా నోరు విప్పితే ఇంటర్నెట్లో వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. ఏదైనా జరిగితే తన చదువు ఆగిపోతుందేమోనని భయపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదని,దీంతో వీడియోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ నెలల తరబడి టీచర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత విద్యార్థిని తెలిపింది. ఫలితంగా గర్భం దాల్చిందని బాధితురాలు తెలిపింది.
Extramarital Affair : ప్రసవం కోసం పుట్టింటికి భార్య..ప్రియురాలితో భర్త జంప్!
. ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న రంజిత్ మరియు అతని కుటుంబ సభ్యులు విద్యార్థినితో బలవంతంగా కొన్నింటిని తినిపించారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు పరిస్థితి విషమంగా మారింది. అనంతరం కుటుంబ సభ్యులకు జరిగిన కథంతా చెప్పింది బాధిత విద్యార్థిని. కుటుంబసభ్యులు తనను డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. ఈ విషయమై గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది, అయితే నిందితుడైన ఉపాధ్యాయుడు మరియు అతని కుటుంబ సభ్యులు పంచాయతీకి రాకపోవడంతో గమ్హారియా పోలీస్ స్టేషన్లో బాధితురాలి కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Minor girl pregnant, Minor girl raped