విశాఖనగరంలోని గాజువాకలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు హార్న్ కొట్టాడనే కోపంతో ఓ విద్యార్థిని చితకబాదడు స్కూల్ వాచ్ మెన్. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు.
స్కూల్ కు కాపలా ఉండాల్సిన ఓ వాచ్మెన్ (watchmen beat student) కర్కసంగా ప్రవర్తించాడు. క్షణికావేశంలో ఓ విద్యార్థుని చితక్కొట్టాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరూ స్కూల్ ఆవరణలోకి రాకుండా చూడడం అతడి విధి. ఒకవేళ ఎవరైనా అలా వస్తే వారిని అడ్డుకోవడం మాట వినకపోతే బెదిరించడం ఇంకా కుదరకపోతే యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం అతడి విధి.. కానీ ఓ వాచ్మెన్ మాత్రం తన చేతిలో ఉన్న కర్ర దండించడానికే అన్నట్టు ఫీలయ్యాడు. ఓ విద్యార్థి తప్పుచేశాడని భావించి బెత్తంతో బడితపూజ చేశాడు. విద్యార్థులను ఉపాధ్యాయులు చితక్కొడితేనే తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న రోజులు.. కానీ వాచ్ మెన్ ఓ విద్యార్థిని ఒంటిపై తట్లు తేరేలా వాచ్మెన్ చితక్కొడం వివాదాస్పదమైంది.
ఇంతకీ ఏం జరిగింది అంటే సెలవు రోజున విద్యార్ధి గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని.. వాచ్మెన్ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వెంటనే వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. విశాఖపట్నం నగరంలోని గాజువాకలో (gajuwaka in visakhapatnam) ఈ దారుణ ఘటన జరిగింది. అయితే విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో వాచ్మెన్ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాజువాక బీసీ రోడ్డులో ఉన్న మార్వెల్ పాఠశాలలో (marvel school) చ్తెతన్య అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. మొన్న ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్థులతో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు. వాచ్మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలలలో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడంతో వాచ్‌మెన్‌కు ఆగ్రహం కట్టలు తెంచేలా చేసింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్మెన్ కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే రాత్రి నిద్రిస్తుండగా తల్లి సత్యగౌరి చూసి ప్రశ్నించగా ఈ విషయం బయటకు వచ్చింది.
ఉదయం లేచిన తరువాత పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. విద్యార్థి నిజంగా ఒకవేళ తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్మెన్ కొడతారా అని ప్రశ్నించారు. విద్యార్ధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి వాచ్‌మెన్‌ను పిలిపించారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే వాచ్మెన్ దారుణంగా కొట్టాడని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.