Nagarjunasagar: ఉప ఎన్నిక ప్రచారం వేళ తీవ్ర విషాదం.. వీడని కరోనా కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక..

ప్రతీకాత్మక చిత్రం

Private teacher suicide: ఓ వైపు నాగార్జున సాగర్ లో ఎన్నికల ప్రచారం కాక పుట్టిస్తుంటే మరోవైపు కరోనా కారణంగా ఉద్యోగాలు లేక.. జీతాలు అందక ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులను భరించలేక తన భార్య పుట్టింటికి వెళ్లగా మనస్తాపంతో టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Share this:
    నాగార్జున సాగర్ నియోజకవర్గంలో  త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ ప్రైవేటు టీచర్ ఆర్ధిక కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది కాలంగా ప్రైవేట్ టీచర్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడిన విషయం కళ్లారా చూశాం. తమ బతుకు బండి లాగడానికి చాలా మంది కూరగాయలు, పండ్లు అమ్ముకుని భార్యా పిల్లలను పోషించుకుంటుంటే.. మరికొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా.. చిల్లర వర్తకులుగా మారి ఆ రోజుకు ఇంటిని గట్టెక్కితే చాలు అనుకొని బతికారు. ఇలా దినదనగండం నూరేళ్ల ఆయుషులాగా తమ జీవన విధానం మారింది. త్వరలోనే తమ కష్టాలు పోతాయనుకున్న సమయంలోనే ఈ మహమ్మారి రూటు మార్చింది. సెకండ్ వేవ్ తో బక్క జనాలపై విరుచుకుపడుతోంది. దీంతో పాఠశాలలను తెరిచినట్లే తెరిచి మరల మూసి వేశారు. ఏడాది కాలంగా రావాల్సిన జీతాలు రాక చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారు. ఎంతో మంది ఆత్మహ్యతకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    తాజాగా కరోనా కష్టాలు భరించలేక మరో ప్రైవేటు టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ అర్ధాకలితో అలమటిస్తుంటే ఈ కష్టాలు తాను భరించలేనంటూ కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో జరిగిన ఘటన విషాదం రేపింది. ఏడాదిగా లాక్ డౌన్ వల్ల స్కూళ్లు మూతపడడంతో ఎంతో మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లు ఉపాధి కోల్పోయి ఇదే కోవలోనే నాగర్జునసాగర్ హిల్ కాలనీలో నివాసం ఉంటున్న రవి (30) డివైన్ మెర్సీ స్కూల్లో ప్రైవేటు టీచర్ గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఏడాదిగా ప్రైవేట్ స్కూల్లో జీతాలు రాక కుటుంబాన్ని పోషించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇల్లు గడవడం కష్టమైపోవడంతో ఇటీవల భార్యా భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య ఇల్లు విడిచి పోవటంతో మనస్థాపానికి గురైన రవి తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

    కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. రోజు గడవటం కష్టంగా మారింది. ఓ పూట తిండి కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ లో పని చేసే టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏడాదిగా స్కూల్స్ లేకపోవడంతో జీతాలు లేక ఆర్థికంగా చితికిపోయారు. కరోనా కారణంగా ఏడాదిగా విద్యాసంస్థలు మూతపడటంతో టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం విద్యాసంస్థలు మూసివేయడంతో వారి ఉపాధి పోయిందని... కనీసం ఇంటి అద్దె కట్టే పరిస్థితీ లేదని.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని టీచర్లు వేడుకుంటున్నారు.
    Published by:Veera Babu
    First published: