news18-telugu
Updated: November 18, 2020, 6:45 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ పెషేంట్పై అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా ఉల్లియేరి ప్రాంతంలోని మలబార్ మెడికల్ కాలేజ్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడిని ఆస్పత్రిలో పనిచేస్తున్న 34 ఏళ్ల అశ్విన్ కృష్ణగా గుర్తించారు. వివరాలు.. కరోనాతో బాధపడుతున్న మహిళ పెషేంట్‌కు డాక్టర్‌ను కలిపిస్తానని నమ్మించాడు. మొదట హాస్పిటల్ రిజిస్టర్ నుంచి పెషేంట్ నంబర్ తీసుకుని ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. అయితే అతని మెసేజ్‌లతో అసౌకర్యంగా ఫీలైన ఆ పెషేంట్.. ఈ విషయాన్ని డాక్డర్‌కు తెలియజేసింది. ఆ తర్వాత అశ్విన్ పెషేంట్ చికిత్స పొందుతున్న గది వద్దకు వచ్చి డాక్టర్ ఆమెను కలవాలని అంటున్నాడని చెప్పాడు. అనంతరం ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నట్టుగా లిఫ్ట్‌లో ఎక్కించాడు.
లిఫ్ట్ 4వ అంతస్తుకు చేరుకోగానే.. అశ్విన్ ఆమెను బలవంతంగా అందులో నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆమె అక్కడి నుంచి తప్పించుకుని.. ఈ విషయాన్ని ఇతర పెషేంట్లకు, ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందజేసింది. దీంతో ఆస్పత్రి రిసెప్షన్లలో పలువురు పెషేంట్లు అశ్విన్‌ను నిలదీశారు. ఇక, ఆ మహిళ పెషేంట్ ఫిర్యాదు మేరకు అథోలి పోలీసులు అశ్విన్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.
మరోవైపు అశ్విన్‌ను సస్పెండ్ చేసినట్టు ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. అశ్విన్ ఓ మహిళ పేషెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు అందిందని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తాము నమ్ముతున్నామని పేర్కొంది. ఇక, కేరళలో ఇలా కరోనా పేషెంట్లు లైంగిక వేధింపులకు గురికావడం ఇది రెండోసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా సోకిన 20 ఏళ్ల మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న డ్రైవర్.. ఆమెను లైంగిక వేధించి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Published by:
Sumanth Kanukula
First published:
November 18, 2020, 6:45 AM IST