Home /News /crime /

PRIVATE HOSPITAL MANAGER IN CHENNAI COMMITS SUICIDE BY INJECTION SSR

So Sad: ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేసే ఈ కుర్రాడు ఎంతపని చేశాడో చూడండి..

సందీప్ మోహన్ (ఫైల్ ఫొటో)

సందీప్ మోహన్ (ఫైల్ ఫొటో)

తమిళనాడులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడు సందీప్ మోహన్. కేరళకు చెందిన ఈ యువకుడు అతను పనిచేసే హాస్పిటల్ టాప్ ఫ్లోర్‌లో ఉన్న గదిలోనే ఉంటుండేవాడు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి హాస్పిటల్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు.

ఇంకా చదవండి ...
    చెన్నై: తమిళనాడులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడు సందీప్ మోహన్. కేరళకు చెందిన ఈ యువకుడు అతను పనిచేసే హాస్పిటల్ టాప్ ఫ్లోర్‌లో ఉన్న గదిలోనే ఉంటుండేవాడు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి హాస్పిటల్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇటీవల సందీప్ కరోనా బారిన పడటంతో హాస్పిటల్ టాప్ ఫ్లోర్‌లో తను ఉంటున్న గదిలోనే సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాడు. ఇతనితో పరిచయం ఉన్న అదే హాస్పిటల్‌లో పనిచేసే ఓ నర్స్ ఇటీవల టీ ఇచ్చేందుకు అతని గది వద్దకు వెళ్లింది. డోర్ లాక్ చేసుకుని ఉండటంతో ఆమె చాలాసార్లు అతనిని పిలిచింది. ఉలుకూపలుకూ లేకపోవడంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్నాడు. ఇంజెక్షన్ సిరంజీ ద్వారా శరీరంలోకి ప్రాణం తీసే కెమికల్‌ను ఇంజెక్ట్ చేసుకున్నట్టుగా ఆమెకు కనిపించింది. వెంటనే.. డాక్టర్లకు విషయం చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. డోర్ బద్ధలు కొట్టి అతనిని పరీక్షించగా అప్పటికే అతను చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు