హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : బాలిక నగ్న వీడియో షేర్.. బస్ డ్రైవర్ అరెస్ట్.. ఖతర్నాక్ కన్నింగ్ వీడు..

Crime : బాలిక నగ్న వీడియో షేర్.. బస్ డ్రైవర్ అరెస్ట్.. ఖతర్నాక్ కన్నింగ్ వీడు..

ఆకాష్

ఆకాష్

బస్ డ్రైవర్లంతా మంచివారే ఉండరు. కొందరు డ్రైవర్ ముసుగు వేసుకొని.. మోసం చేసేందుకు కుట్రలు పన్నుతూ ఉంటారు. పెద్దవాళ్లైతే.. ఆ కుట్రలను ఈజీగా కనిపెట్టగలరు అనుకున్న ఆ కంత్రీ.. ఓ బాలికను చీట్ చేయడానికి యత్నించాడు. మరి పోలీసులకు ఎలా దొరికాడో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అది కేరళలోని.. తిరువనంతపురం. అటింగల్ ఏరియా. అక్కడి ఓ చిన్న హోటల్‌లో మొబైల్‌లో పాటలు వింటూ.. టీ తాగుతున్న ఎస్ ఆకాష్‌ను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లు పట్టుకోగానే.. 24 ఏళ్ల ఆకాష్ ముఖంలో కలర్స్ మారిపోయాయి. "నేనేతప్పూ చెయ్యలేదు. నాకేం తెలీదు. ఎవరో అనుకొని నన్ను పట్టుకుంటున్నారు" అంటూ ఆకాష్ ఎదురు తిరిగాడు. "నాటకాలాడకు ఆకాష్ అంటే నువ్వే కదా" అంటే.. కాదు కాదంటూ... "నా పేరు నందూ" అని చెప్పాడు. కానీ.. అతనికి ఆకాష్‌తోపాటూ నందూ అనే పేరు కూడా ఉందనే విషయం పోలీసులకు తెలుసు. రెండు పేర్లతో చెలామణీ అవుతున్నాడు. డ్రామాకి ఫుల్‌స్టాప్ పెట్టి.. స్టేషన్‌కి తీసుకుపోయారు.

కేసేంటి?

ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడని తల్లిదండ్రులు అతనికి ఆకాశ్ అని పేరు పెడితే.. వాళ్ల పరువు తీశాడు. ఇతగాడు.. ప్రైవేట్ బస్ నడుపుతున్నాడు. రోజూ చాలా మంది ప్రయాణికులు ఇతని బస్ ఎక్కుతుంటారు. అలా ఎక్కే వారిలో అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ ఎవరూ ఇతని వైపు చూసేవారు కూడా కాదు. చాలా మంది లాగే తను కూడా ఓ అమ్మాయిని ప్రేమించాలి అనుకున్నాడు. అది కుదరలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ.. చివరకు ఓ హైస్కూల్ బాలికపై కన్నేశాడు. వీలైనప్పుడల్లా బాలిక వెంట వెళ్లేవాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఆ బాలిక స్పందించేది కాదు.

ఓ రోజు కుట్రపూరితంగా ఆ బాలిక నగ్నంగా వీడియో రికార్డ్ చేశాడు. ఆ విషయం ఆ బాధితురాలికి తెలియదు. ఆ తర్వాత ఆ వీడియో ద్వారా ఆమెను బెదిరించి.. లొంగదీసుకోవాలి అనుకున్నాడు. అందుకు ఒప్పుకోకపోయేసరికి.. వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తా అని బెదిరించాడు. అప్పటికీ ఆ బాలిక ధైర్యంగానే పోరాడి.. అతని నుంచి దూరంగా పారిపోయింది.

తన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదన్న ఆగ్రహంతో రగిలిపోతూ.. వీడియోని తన ఫ్రెండ్స్‌కి షేర్ చేశాడు. అది వైరల్ అయ్యింది. ఎవరో బాలిక తండ్రికి కాల్ చేసి.. మీ అమ్మాయి ఇలా కనిపించిందని చెప్పడంతో.. షాకైన తండ్రి.. అసలేమైందని కూతుర్ని ప్రశ్నించగా.. మొత్తం చెప్పింది. కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్‌లో బాలికతో కంప్లైంట్ ఇప్పించిన తండ్రి.. మరే బాలికకూ ఇలా జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయం తెలియగానే.. ఆకాష్ పారిపోయాడు.

Chicken Recipe : గ్రీన్ చికెన్ కర్రీ.. ఇలా చేశారంటే.. ఓ పట్టు పడతారంతే..

ఆకాష్ కోసం ఒక టీమ్ రంగంలోకి దిగింది. స్థానికుల్ని ఆరా తీసింది. బస్ ఓనర్‌ని ప్రశ్నించింది. ఆకాష్ మొబైల్ స్వి్చ్ఛాఫ్ అయి ఉంది. కానీ ఆకాష్ ఎవరికైతే వీడియోని షేర్ చేశాడో.. పోలీసులు వాళ్లను పట్టుకొని.. "వాడెక్కడున్నాడో చెబుతారా లేక మిమ్మల్ని లోపల వెయ్యమంటారా" అనడంతో.. ఆకాష్ ఆచూకీ చెప్పేశారు. అలా అతన్ని పట్టుకున్నారు పోలీసులు.

ఈ కథలో సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఆకాష్ మొబైల్‌ని చెక్ చెయ్యగా.. అందులో బస్ ఎక్కడానికి వచ్చే కొందరు అమ్మాయిలు, బాలికల ఫొటోలు, వీడియోలూ ఉన్నాయి. వీడు మామూలోడు కాదనుకుంటూ పోలీసులు.. కేసును లోతుగా దర్యాప్తు చెయ్యడం మొదలుపెట్టారు.

First published:

Tags: Crime, Crime news, Kerala

ఉత్తమ కథలు