Home /News /crime /

PRISONERS TELLS TO THE FAMILY MEMBERS THEY ARE FRIGHTENED ABOUT THE BEHAVIOUR OF PADMAJA SSR

ఖైదీలకు చుక్కలు చూపిస్తున్న పద్మజ.. మూడు రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామంటూ..!

నిందితురాలు పద్మజ

నిందితురాలు పద్మజ

క్షుద్రపూజల పేరుతో కన్నకూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితురాలైన పద్మజ తన వింత ప్రవర్తనతో మదనపల్లె సబ్ జైలులో ఖైదీలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. ఆమె దెబ్బకు హడలెత్తిపోయిన ఖైదీలు ములాఖత్‌కు వచ్చిన తమ కుటుంబ సభ్యులకు రెండుమూడు రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పారు. ‘కలియుగంలో యుద్ధం జరుగుతోంది. నేనే శివుడిని. కాళికను. నన్నే లోపలేస్తారా’ అని బిగ్గరగా అరుస్తూ రాత్రుళ్లు అందరినీ హడలెత్తించినట్లు సమాచారం. అర్ధరాత్రి తాను శివుడినంటూ కేకలేస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుండి కిందపడినట్లు తోటి ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో...

ఇంకా చదవండి ...
  చిత్తూరు: క్షుద్రపూజల పేరుతో కన్నకూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితురాలైన పద్మజ తన వింత ప్రవర్తనతో మదనపల్లె సబ్ జైలులో ఖైదీలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలిసింది. ఆమె దెబ్బకు హడలెత్తిపోయిన ఖైదీలు ములాఖత్‌కు వచ్చిన తమ కుటుంబ సభ్యులకు రెండుమూడు రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పారు. ‘కలియుగంలో యుద్ధం జరుగుతోంది. నేనే శివుడిని. కాళికను. నన్నే లోపలేస్తారా’ అని బిగ్గరగా అరుస్తూ రాత్రుళ్లు అందరినీ హడలెత్తించినట్లు సమాచారం.

  అర్ధరాత్రి తాను శివుడినంటూ కేకలేస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుండి కిందపడినట్లు తోటి ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో చెప్పినట్టు తెలిసింది. ఈ ఘటనతో హడలెత్తిపోయిన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి మదనపల్లి సబ్ జైలులో ఈ ఘటన జరిగింది. పద్మజ భర్త పురుషోత్తం నాయుడు కూడా తనలో తాను కుమిలిపోతూ, బిగ్గరగా ఏడుస్తున్నాడని చెప్పారు. కరోనా నేపథ్యంలో 9 నెలలుగా రిమాండ్ ఖైదీలతో ములాఖత్‌ను నిలిపివేసిన జైలు అధికారులు సోమవారం నుంచి కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతిచ్చారు.

  ఇదిలా ఉంటే.. జంట హత్యల కేసులో నిందితురాలైన పద్మజ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వైద్య నిపుణులు చికిత్స నిమిత్తం విశాఖ ఆసుపత్రికి తరలించాలని రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో సబ్ జైలులోని ప్రత్యేక గదిలో పద్మజను ఉంచిన జైలు అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్‌ను కాపలాగా పెట్టారు. నిందితులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలిస్తే కేసు దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు ఎస్కార్ట్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆలస్యం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నిందితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ స్థానిక న్యాయవాది ఒకరు జేఎఫ్‌సీఎం కోర్టులో పిటిషనల్ దాఖలు చేసినట్టు తెలిసింది. అలేఖ్య(27), సాయిదివ్యను(23) హత్య కేసులో ప్రధాన నిందితురాలైన తల్లి పద్మజ వ్యవహారశైలి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉండటం గమనార్హం. ‘తెల్లారే వరకూ మమ్మల్ని వదిలేయండి. మా పిల్లలు బతికొస్తారు. ఆపై నేనే పోలీసులకు లొంగిపోతాను’ అని తల్లి పద్మజ ఘటన వెలుగుచూసిన అనంతరం పోలీసులతో చెప్పిన సంగతి తెలిసిందే.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: AP News, Chittoor, Crime news, Jail, Murders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు