షాకింగ్ : మర్మాంగం గుండా కడుపులోకి సెల్‌ఫోన్.. జైలు ఖైదీ నిర్వాకం..

తన ప్రైవేట్ పార్ట్స్‌లో ఫోన్‌ను దాచిపెట్టిన నిందితుడు.. జైలుకు వెళ్లాక మర్మాంగం గుండా దాన్ని కడుపులోకి చేర్చాడు.అనంతరం తీవ్రమైన కడుపునొప్పితో కుప్పకూలాడు.

news18-telugu
Updated: September 18, 2019, 10:29 AM IST
షాకింగ్ : మర్మాంగం గుండా కడుపులోకి సెల్‌ఫోన్.. జైలు ఖైదీ నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్ జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు జైలు ఖైదీలు మర్మాంగాల ద్వారా డ్రగ్స్ పాకెట్స్‌ను తమ కడుపులోకి చేర్చారు. ఇందులో ఓ ఖైదీ ఏకంగా సెల్‌ఫోన్‌ను సైతం మర్మాంగాల ద్వారా తన కడుపులోకి చేర్చడం గమనార్హం. ఇటీవల వారిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తీసుకొచ్చాక..తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో అసలు విషయం బయటపడింది. భరించలేని నొప్పితో ఇద్దరు అరవడంతో
వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స తర్వాత కూడా వారి పరిస్థితిలో మార్పు లేదు. దాంతో ఖైదీలే వైద్యులతో అసలు విషయం
చెప్పారు. తాము డ్రగ్స్ ప్యాకెట్స్‌ను మర్మాంగాల ద్వారా కడుపులోకి చేర్చినట్టు చెప్పారు. తన కడుపులోకి సెల్‌ఫోన్‌ను చేర్చిన విషయాన్ని అందులో ఓ ఖైదీ డాక్టర్‌తో చెప్పాడు.వైద్యులు వెంటనే జైలు సిబ్బందికి ఈ సమాచారాన్ని చేరవేశారు. అనంతరం ఖైదీల కడుపుల్లో ఉన్న డ్రగ్ ప్యాకెట్స్‌ను బయటకు తీశారు.

సోమవారం ఈ ఇద్దరు ఖైదీలను బాగ్‌పాట్ కోర్టు వద్దకు తీసుకొచ్చిన సమయంలో.. పోలీసుల సమక్షంలోనే వారి బంధువులతో కలిశారు. ఆ సమయంలో అందులో ఓ ఖైదీకి తమ బంధువులు మొబైల్ ఫోన్ ఇచ్చినట్టు సమాచారం.తన ప్రైవేట్ పార్ట్స్‌లో ఫోన్‌ను దాచిపెట్టిన నిందితుడు.. జైలుకు వెళ్లాక మర్మాంగం గుండా దాన్ని కడుపులోకి చేర్చాడు.అనంతరం తీవ్రమైన కడుపునొప్పితో కుప్పకూలాడు. అతనితో పాటు మరో ఖైదీ కూడా మర్మాంగం గుండా డ్రగ్స్ ప్యాకెట్స్ కడుపులోకి చేర్చడంతో..తీవ్రమైన నొప్పితో బాధపడుతూ కుప్పకూలాడు. దాంతో హుటాహుటిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.కడుపులో ఉన్న సెల్‌ఫోన్‌ను బయటకు తీయాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.


First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>