ఈ ’ఖైదీ’ కథ చదివితే మీరు కచ్చితంగా నవ్వుతారు...

పోలీసుల నుంచి ఓ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత గంటలోనే మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. అది కూడా ఎంతో ఫన్నీగా.

news18-telugu
Updated: December 23, 2018, 1:01 AM IST
ఈ ’ఖైదీ’ కథ చదివితే మీరు కచ్చితంగా నవ్వుతారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గ్రహచారం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందంటారు. పాపం ఆ ఖైదీ పరిస్థితి కూడా అంతే. అంత్యంత చాకచక్యంగా జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే, టైం బాగోలేదు. ఏకంగా మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. అమెరికాలోని కెంటకీలో ఈ సంఘటన జరిగింది. గ్రీనప్ కౌంటీ నుంచి ఆ ఖైదీని తరలిస్తుండగా తన చేతులకు వేసిన బేడీలు చాలా గట్టిగా ఉన్నాయని, వాటిని వదులు చేయాలంటూ ఆ 31 ఏళ్ల ఖైదీ పోలీసులను కోరాడు. దీంతో పోలీసు ఆ బేడీలను కొంచెం వదులు చేసే పనిలో పడ్డాడు. ఒక చేతికి ఉన్న బేడీని తీయగానే వెంటనే ఆ ఖైదీ పారిపోయాడు. పోలీసులు అలర్ట్ అయ్యేలోపే జారుకున్నాడు. దీంతో పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. సమీపంలోని పోలీసు స్టేషన్లు, హైవే పెట్రోలింగ్‌కు సమాచారం ఇచ్చారు.

పోలీసుల నుంచి పారిపోయిన ఖైదీ కొంచెం దూరం వెళ్లాడు. ఎలాగో ఓ హైవే మీదకు చేరుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లడానికి రోడ్డు మీద వెళ్లే కార్లను లిఫ్ట్ అడగడం మొదలుపెట్టాడు. చివరకు ఓ మంచిమనిషి రోడ్డు మీద కారు ఆపి ఆ ఖైదీకి లిఫ్ట్ ఇచ్చాడు. ఎక్కడకు వెళ్లాలి? ఏం చేస్తుంటారు? అని పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా, ఖైదీ రెండో చేతికి ఉన్న బేడీలను ఆ వ్యక్తి గమనించాడు. అయితే, అతడు పోలీసు కూడా కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బేడీలను చూడగానే పోలీసు బుర్ర వెలిగింది. అలాగే, ఆ ఖైదీని మాటల్లో పెట్టి డైరెక్టుగా తీసుకెళ్లి పోలీసుల వద్దకు తీసుకెళ్లి కారు ఆపాడు. వెంటనే ఆ ఖైదీని పోలీసులు మళ్లీ పట్టుకున్నారు.

గతంలో చేసిన తప్పులకు జైలు శిక్షతో పాటు ఇప్పుడు పారిపోయినందుకు మళ్లీ ఇంకో కేసు నమోదైంది. పోలీసుల నుంచి తప్పించుకుని పోలీసునే లిఫ్ట్ అడిగి దొరికిపోయిన ఆ ఖైదీ స్టోరీ చదివిన వారంతా ‘ఫన్నీ’గా ఉందంటున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 23, 2018, 1:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading