Home /News /crime /

PRINCIPLE SEXUALLY HARASSED COLLEGE GIRLS IN ADILABAD MS

ఆదిలాబాద్‌లో కీచక ప్రిన్సిపల్.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కీచక ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కీచక ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.క్రీసెంట్ కాలేజీ ప్రిన్సిపల్ రఫీ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని కొంతమంది విద్యార్థినులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు..అనంతరం కాలేజీ ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేసి అక్కడినుంచి
    పంపించేశారు.

    ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తమ అమ్మాయిని ప్రిన్సిపల్ రఫీ వేధిస్తున్నాడని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. తరుచూ ఫోన్ చేయడం,అసభ్యకరంగా మాట్లాడటం వంటి చేష్టలతో తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాడన్నారు. మానసికంగా,శారీరకంగా వేధింపులకు పాల్పడుతున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ రఫీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Adilabad, Disha Act, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు