అందరూ ఒకేలా ఉండరు. కొందరు సమాజంలోని వ్యక్తులకు విరుద్ధంగా ఉంటారు. సంఘటనలు అంతే కొన్ని విచిత్రమైన విషయాలు వినాల్సి వస్తుంది. రాజస్థాన్(Rajasthan)లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకుంటే కడుపు చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కాని ..ఆ వీడియో చూస్తే ఇలాంటి కష్టం ఏ మగవాడికి కూడా రాకూడదని కోరుకుంటారు. అల్వార్ (Alwar)జిల్లా భివాడి(Bhiwadi)లో ప్రభుత్వ పాఠశాల(Public school)ప్రధానోపాద్యాయుడి(Principal)గా పనిచేస్తున్నాడు అజిత్ సింగ్ యాదవ్(Ajit Singh Yadav). హర్యానాHaryanaలోని సోనిపట్(Sonipat)లో నివాసముంటున్న సుమన్ (Suman)అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో సాఫీగా సాగిన కాపురంలో రోజులు పెరిగే కొద్ది భార్య ప్రిన్సిపల్‌ని వేధించడం మొదలుపెట్టింది.
భార్య కాదు రాక్షసి..
భార్య వేధింపులు క్రమంగా దాడి చేయడం వరకు వెళ్లాయి. ఆ తర్వాత ఇంట్లో తలుపులు వేసి భర్తను చపాతి కర్రతో, అట్లకాడ తీసుకొని జుట్టు పట్టుకొని వీపు, తలపై కొడుతూ ఉండేది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కావడంతో భరిస్తూ వచ్చాడు. స్కూల్ ప్రిన్సిపాల్. భార్య అపరకాళిగా మారి నిత్యం కొట్టడం, గృహహింసకు పాల్పడటంతో విసిగిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు మొదట ప్రిన్సిపల్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో అజిత్సింగ్యాదవ్ భార్య ఈసారి కంప్లైంట్ ఇస్తే నేనే తిరిగి కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చింది. భార్య పెట్టే చిత్రహింసల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఇంట్లో సీక్రెట్‌గా సీసీ కెమెరాలు అమర్చాడు. పోలీసులకు ఆధారాలు చూపించాలి కాబట్టి ..భార్య పెట్టే టార్చర్‌కి సంబంధించిన వీడియోతో పాటు కొట్టిన తర్వాత బయటకు గెంటేసే వీడియోని తీసుకొని ఏకంగా కోర్టులో కేసు వేశాడు. ఒక భార్య ఉన్నత విద్యావంతుడైన ఓ ప్రభుత్వ స్కూల్ హెడ్మాస్టర్ని కొడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
కాపాడమని కోర్టుకెక్కిన భర్త..
ఎక్కడైనా గృహహింస కేసులు మహిళలు భర్త, అత్తమామలపై పెడతారు. కాని రాజస్థాన్‌లో ఓ మగవాడు, అందులో భార్యపై పెట్టడం చూసి కోర్టు ఆశ్చర్యపోయినప్పటికి అతను న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాలు చూపి నివ్వెరపోయారు భివాడి కోర్టు జడ్జి. పూర్తి ఆధారాలు, బాధితుడి వాంగ్మూలం విన్న న్యాయస్థానం స్కూల్ ప్రిన్సిపల్ అజిత్‌సింగ్ యాదవ్‌కి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రాణరక్షణ కోసం సీసీ కెమెరాలు పెట్టడం వల్ల బతికిపోయానని..లేకపోతే భార్య చేతిలో మరికొన్ని రోజులు తన్నులు తినాల్సి వచ్చేదని న్యాయమూర్తి ముందు తన సంతృప్తిని వ్యక్తం చేశారు స్కూల్ ప్రిన్సిపల్. భార్యభర్తల మధ్య గొడవ ఎలా ఉన్నా...తన్నుతోందని వీడియో కోర్టులో సమర్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Rajasthan, Viral Video