PRIMARY SCHOOL STUDENT PEEPS OUT OF BUS IN GHAZIABAD DIES AFTER HEAD HITS POLE PVN
Shocking: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తూ..స్తంభానికి తల తగిలి విద్యార్థి మృతి
ప్రతీకాత్మక చిత్రం
Student died : స్కూల్ బస్సు కిటికీలోంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ టౌన్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ టౌన్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో చదువుతున్న విద్యార్థి..బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకి బయల్దేరాడు.
Student died : స్కూల్ బస్సు కిటికీలోంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తరప్రదేశ్(UTTARPRADESH) రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్ టౌన్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ టౌన్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో చదువుతున్న విద్యార్థి..బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకి బయల్దేరాడు. అయితే బస్సు విండో నుంచి తల బయటకు పెట్టి చూస్తున్న విద్యార్థి(STUDENT)..సడెన్ గా కరెంట్ పోల్ తగిలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఘటన జరిగిన తర్వాత పాఠశాల అధికారులు తమను పిలిపించి చిన్నారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పారని, వాంతులు చేసుకునేందుకు బస్సు బయటికి చూశాడని..దీంతో తల కరెంట్ పోల్ కు తగిలిందని చెప్పారని...అయితే నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్కు వెళ్లేటప్పుడు తన కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడని విద్యార్థి తండ్రి అంకుర్ నెహర్ తెలిపాడు. స్కూల్ యాజమాన్యం చెప్పేదంతా అబద్ధమని ఆరోపించాడు. పాఠశాల వాదనలు నిరాధారమైనవన్నారు. నిర్లక్ష్యం వల్ల తన కుమారుడి మరణానికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమండ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల అధికారులను విచారిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.