అమరావతి ఆలయంలో దారుణం... సంతానం కోసం గుడికి వెళ్లిన మహిళపై..

పిల్లలు పుట్టాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: November 27, 2019, 9:01 AM IST
అమరావతి ఆలయంలో దారుణం... సంతానం కోసం గుడికి వెళ్లిన మహిళపై..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లా అమరావతి ఆలయంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు పూజారి. పిల్లల పుట్టడం కోసం పూజలు చేసేందుు వచ్చిన వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేశాడు. గుంటూరు జిల్లా అమరావతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన దంపతులు నిన్న ఉదయం గ్రామంలోని ఆలయాన్ని సందర్శించుకున్నారు. సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు. పిల్లలు పుట్టాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడ్డ ఆమె గట్టిగా అరుస్తూ అతడి నుంచి తప్పించుకుని పరుగులు తీసింది. దీంతో భయపడిన అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వారు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.


First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>