PRIEST HELD FOR SEXUAL ASSAULT ON CHILD IN KARNATAKA DEVANAHALLI SU
ఆడుకుంటున్న బాలికకు స్నాక్స్ ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డ పూజారి
ప్రతీకాత్మక చిత్రం
ఓ పదేళ్ల చిన్నారపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు స్నాక్స్ ఇప్పిస్తానని ఆశ చూపి గదిలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డాడు.
ఓ పదేళ్ల చిన్నారపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు స్నాక్స్ ఇప్పిస్తానని ఆశ చూపి గదిలోకి పిలిచి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. వెంకటరమణప్ప అనే వ్యక్తి బాగేపల్లిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు దేవనహల్లిలో నివాసం ఉంటున్న తన కుమార్తె-అల్లుడిని చూసేందుకు అక్కడికి వెళ్లాడు. అతడి అల్లుడు దేవనహల్లిలోని ఓ గుడిలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వెంకటరమణప్ప కుమార్తె, అల్లుడు ఓ ఫంక్షన్ నిమిత్తం బయట ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో ఆలయంలో పూజలు నిర్వహించే బాధ్యతను వెంకటరమణప్పకు అప్పగించారు. అయితే తన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆలయం సమీపంలోని రూమ్ వద్దకు చేరుకున్నాడు. ఆ రూమ్ సమీపంలో ఆడుకుంటున్న పిల్లల్ని చూశాడు. అందులో ఓ పదేళ్ల బాలికకు స్నాక్స్ ఇపిస్తానని చెప్పి తన గదికి పిలిచాడు.
అయితే అదే సమయంలో తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లి చుట్టుపక్కలు వెతకడం ప్రారంభించారు. అయితే గుడి వద్ద పూలు అమ్మే వ్యాపారి ఒక్కరు.. బాలిక పూజారి రూమ్‌లోకి వెళ్లిందని చెప్పాడు. దీంతో బాలిక తల్లి మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి పూజారి ఉన్న రూమ్ వద్దకు వెళ్లింది. అప్పుడు బాలిక ఏడుస్తూ బయటికి రావడం వారు చూశారు. లోపల పూజారి తనతో ప్రవర్తించిన తీరును బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పూజారిని అరెస్ట్ చేశారు.
పూజారి వెంకటరమణప్పపై పొక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూజారి గదిలోకి వెళ్లిన బాలిక వెంటనే తిరిగి బయటకు రాలేదని.. రెండు మూడు నిమిషాల తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు సీసీటీవీలో రికార్డు అయిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.