పూజలు చేయిస్తానని చెప్పి...గుడిలోనే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన మాయగాడు..

స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ చేయాలని ఆమెకు చెప్పగా అందుకు ఆమె సరేనంది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లగా, అందులోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో బాధిత మహిళపై నిందితుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: September 14, 2019, 11:17 PM IST
పూజలు చేయిస్తానని చెప్పి...గుడిలోనే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన మాయగాడు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 14, 2019, 11:17 PM IST
పూజలు చేయిస్తానన్న ఓ మాయగాడు గుడికి తీసుకెళ్లి ఆ పవిత్ర స్థలంలోనే బాధిత మహిళపై అత్యాచారానికి యత్నించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వ్యక్తిగత, మానసిక సమస్యలను ఆధ్యాత్మిక చింతనల ద్వారా తీర్చుకునేందుకు ఓ మహిళ, స్థానికంగా ఉన్న ఓ పూజారిని సంప్రదించగా, సమస్యల నివారణకు రెండు పూజలు చేయాలని అతను ఆమెకు సలహా ఇచ్చాడు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ చేయాలని ఆమెకు చెప్పగా అందుకు ఆమె సరేనంది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లగా, అందులోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో బాధిత మహిళపై నిందితుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ తనపై నిందితుడు అత్యాచార యత్నానికి పాలడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...