హోమ్ /వార్తలు /క్రైమ్ /

మరిదితో వివాహేతర సంబంధం.. 7నెలల గర్భంతో ఒకే చీరకు ఉరేసుకున్న ఇద్దరు -రెండో భార్యగా ఉండలేక..

మరిదితో వివాహేతర సంబంధం.. 7నెలల గర్భంతో ఒకే చీరకు ఉరేసుకున్న ఇద్దరు -రెండో భార్యగా ఉండలేక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేవలం పిల్లల్ని కనడానికే అక్కకు సవతిగా ఆ ఇంట్లోకి ప్రవేశించిన యువతి.. అనుకోని పరిస్థితుల్లో మరిదికి దగ్గరైంది.. వివాహేతర సంబంధం విషయం బయటపడిందనే బాధతో ఒకే చీరకు ఉరి వేసుకున్నారు.. ఏడునెలల గర్భవతి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే..

ఇంకా చదవండి ...

మరణాలకు దారి తీస్తున్న వివాహేతర సంబంధం వ్యవహరాల్లో దీన్ని అరుదైన కేసుగా పోలీసులు చెబుతున్నారు. తోడబుట్టిన అక్క కోసం త్యాగం చేసిన ఆమె.. సవతిగా ఉండేందుకు సిద్దపడింది.. కానీ ఆ భ్రమలో ఎక్కువ కాలం ఉండలేక తనదైన జీవితాన్ని కోరుకుంది.. తప్పని తెలిసినా మరొకరికి దగ్గరైంది.. కానీ పేగుబంధాలు ఆమెకు అడ్డుపడ్డాయి.. ఒకరికి రెండో భార్యగా ఉండలేక.. నచ్చినవాడిని పెళ్లిచేసుకోలేక.. కడుపులో బిడ్డ ఉందన్న సోయి లేకుండా.. అతను ఆమె ఒకే చీరకు ఉరేసుకున్నారు.. సంచలనం రేపిన ఈ కేసులో అసలేం జరిగిందో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో పోలీసులు వివరించారు..

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపనపల్లికి చెందిన ఆంజనేయులు స్థానిక ఎంపీటీసీ. చాలా ఏళ్ల కిందటే అతనికి అర్చన అనే మహిళతో వివాహమైంది. కానీ వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో బంధువుల ప్రోద్బలంతో నాలుగేళ్ల క్రితం అర్చన చెల్లెలయిన అక్షయను ఆంజనేయులు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కొడుకు ఉండగా, ప్రస్తుతం అక్షయ ఏడు నెలల గర్భవతి కూడా. అలాంటిది వాళ్ల ఇంట్లో సోమవారం అనూహ్య సంఘటన జరిగింది..

గర్భంతో ఉన్న అక్షయ.. తన ఇంట్లోనే మరో యువకుడితో కలిసి ఒకే చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. లోపలి నుంచి శబ్దాలు రావడంతో చుట్టుపక్కలవారు పరుగునవెళ్లి వాళ్ల మెడకున్న చీరను విప్పదీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలే ఏడునెలల గర్భం ఉండటంతో దారి మధ్యలోనే అక్షయ ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఉరేసుకున్న యువకుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

అక్షయతోపాటు ఒకే చీరకు ఉరేసుకున్న యువకుడిని మధు(22)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి అతను మరిది వరసు అవుతాడని, చాలా కాలంగా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని, తమ రహస్య బంధం ఇటీవలే ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గర్భిని ఆత్మహత్యతో రెండు కుటుంబాలతోపాటు గోపనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

First published:

Tags: Crime news, Mahabubnagar

ఉత్తమ కథలు