Kerala Accident: భర్త కళ్లెదురుగానే... కేరళలో దారుణం

భార్యాభర్తలిద్దరూ ఒకే బస్ లో వెళ్తున్నారు. ఆమె దిగాల్సిన స్టాప్ వచ్చింది. ఆమె బస్ దిగింది. కానీ ఇంతలోనే మృత్యువు మరో రూపంలో వచ్చింది.

news18
Updated: October 16, 2020, 8:58 AM IST
Kerala Accident: భర్త కళ్లెదురుగానే... కేరళలో దారుణం
ఫైల్ ఫోటో
  • News18
  • Last Updated: October 16, 2020, 8:58 AM IST
  • Share this:
భార్యాభర్తలిద్దరూ ఒకే బస్ లో ప్రయాణం చేస్తున్నారు. ఆమె గర్భిణీ. ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నది. అతడు ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఐదు నెలల గర్భిణీ అయిన ఆమె.. వారిరువురు వెళ్లే దారిలో కొంత ముందు దిగుతుంది. కొద్దిదూరం తర్వాత అతడు దిగాల్సి ఉంది. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుండగా ఇంతలో ఆమె దిగే స్టాప్ వచ్చింది. ఆమెకు జాగ్రత్తలు చెప్పిన ఆ భర్త.. బస్సు నుంచి ఆమె దిగే సమయంలో సాయపడ్డాడు. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పి తిరిగి బస్ ఎక్కేలోపలే ఊహించని ఘోరం. అటువైపుగా వస్తున్న మరో బస్సు ఆమెను ఢీ కొట్టింది. అంతే.. ఆ భర్త రోధన అరణ్య రోధనే అయింది. ఈ విషాధ ఘటన గురువారం కేరళలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

అలప్పుజ కు చెందిన షెల్మి పౌలస్ (33) చండీరూర్ లో ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె భర్త సినోజ్.. అదే ఊళ్లో ప్రయివేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇరువురు ఒకే బస్ లో ఆఫీసుకు వెళ్లే క్రమంలో ఆమె స్టాప్ ముందు వచ్చింది. ఇంతలో ఆమె బస్ దిగింది.

kerala, alappuzha, shelmi faloz, sinoz, road accident in alappuzha, kerala news, kerala crime news, eramallore road accident
ప్రతీకాత్మక చిత్రం


అక్కడి నుంచి వారి ఆస్పత్రికి వెళ్లడానికి మరో బస్ ఎక్కుతున్న క్రమంలో.. పట్టుతప్పి పడిపోయిందది. ఇంతలో కొచ్చి వైపు నుంచి వేగంగా దూసుకువస్తున్న లారీ ఒకటి.. ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డంతా రక్తంతో నిండిపోయింది. ఇంతలో అక్కడే ఉన్న అంబులెన్స్ లో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.

తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె చనిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త ఎదురుగానే నిలబడి ఉండటం గమనార్హం. కాగా, ఆ గర్భిణీని ఢీ కొట్టిన లారీ ఆంధ్రప్రదేశ్ కు చెందినదని పోలీసులు గుర్తించారు. రొయ్యలను సరఫరా చేసే ట్రక్ అని తెలిసింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 16, 2020, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading