Home /News /crime /

PREGNANT WOMEN BURNT ALIVE BY HUSBAND IN UTARAPRADESH FOR OPPOSING EXTRAMARITAL AFFAIR MS

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త.. నిలదీసినందుకు నిండు గర్భిణి సజీవ దహనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనకిప్పుడు తొమ్మిదో నెల. నిండు గర్భిణి. కానీ ఆ భర్త మాత్రం భార్యను వదిలి మరో మహిళతో కులికేవాడు. ఇది తెలిసిన భార్య.. ఎందుకలా చేస్తున్నావని అడిగినందుకు గానూ ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

  • News18
  • Last Updated :
    వాళ్లిద్దరికీ 12 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఇన్నాళ్లకు ఆమె గర్భాన్ని దాల్చింది. అయితే పెళ్లై పదేళ్లు దాటినా భార్య గర్భవతి కాకపోవడంతో ఆ భర్తకు విసుగెత్తింది. ఆమెను తరుచూ వేధిస్తుండేవాడు. తనకు పిల్లలు పుట్టడం లేదని అత్తారింటివాళ్లు హేళన చేసేవారు. ఇదే క్రమంలో ఆమె కొద్దిరోజుల క్రితమే గర్భవతి అయింది. తనకిప్పుడు తొమ్మిదో నెల. నిండు గర్భిణి. కానీ ఆ భర్త మాత్రం భార్యను వదిలి మరో మహిళతో కులికేవాడు. ఇది తెలిసిన భార్య.. ఎందుకలా చేస్తున్నావని అడిగినందుకు గానూ ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

    ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. యూపీలోని ఉన్నావో జిల్లా నాథుకెడకు చెందిన అఖిలేశ్ కు.. కాన్పూర్ లోని నవాబ్ గంజ్ కు చెందిన అంజలి తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇన్నేళ్లైనా ఆమెకు సంతానం కలగకపోయేసరికి.. ఆ భర్త అడ్డదారులు తొక్కాడు. ఆమెకు పిల్లలు కలగడం లేదనే అసహనంతో మరో మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక.. అంజలిని తరుచూ వేధంచేవాడు. అయితే ఈ క్రమంలో ఇటీవలే అంజలి గర్భం దాల్చింది. ఇప్పుడామెకు తొమ్మిది నెలలు. కానీ ఆమె తన భర్త చెడు వ్యసనాలపై తరుచూ ప్రశ్నించేది. వేరే మహిళ దగ్గరకు వెళ్లుతున్నందుకు మందలించేది. ఇవన్నీ ఆ భర్తకు ఆగ్రహం తెప్పించాయి.

    దీంతో ఆమెను చంపడానికి పథకం పన్నాడు.  తొమ్మిది నెలల గర్భిణి అయిన అంజలిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా అని చెప్పి బుధవారం సాయంత్రం పూట ఇంటినుంచి బయల్దేరాడు అఖిలేశ్. కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే.. ఆమెను అక్కడ ఉండమన్నాడు. పక్కనే ఉన్న ఇటుకలతో ఆమె పై దాడి చేశాడు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. కడుపులో పెరుగుతున్నది తన పాపే అనే కనికరం లేకుండా కట్టుకున్న భార్యను ఇటుకలతో కొట్టి చంపాడు. అదీ చాలదన్నట్టు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అక్కడ్నుంచి పారిపోయాడు.

    మరుసటి రోజు (గురువారం) ఉదయం ఆ గర్భిణీ ని కాలబెట్టిన ఊరులోని గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లేసరికి అంజలి మృతదేహం గుర్తుపట్టకుండా కాలిపోయి ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆమె ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అఖిలేశ్ గా అనుమానించి వారి ఇంటికి వెళ్లి వెతకగా.. అప్పటికే అతడు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Pregnant, Unnao, Uttarpradesh

    తదుపరి వార్తలు