ఐదు కాసుల బంగారం కోసం వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న గర్భిణి.. హైదరాబాద్ లో దారుణం

అదనపు కట్నం వేధింపులు మరో మహిళలను బలిదీసుకున్నాయి. ఐదు కాసుల బంగారం తీసుకురమ్మంటూ అత్తంటి వారు చేస్తున్న పోరు ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది.

news18-telugu
Updated: October 22, 2020, 7:00 PM IST
ఐదు కాసుల బంగారం కోసం వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న గర్భిణి.. హైదరాబాద్ లో దారుణం
ఫైల్ ఫొటో
  • Share this:
అదనపు కట్నం వేధింపులు మరో మహిళలను బలిదీసుకున్నాయి. ఐదు కాసుల బంగారం తీసుకురమ్మంటూ అత్తంటి వారు చేస్తున్న పోరు ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందంటే ఎంత ఇబ్బంది పెట్టారో తెలుస్తోంది.  ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కు చెందిన జిమ్ ట్రైనర్ శ్రవణ్ కుమార్ కి గత జూన్ లో కృష్ణ ప్రియ (24)తో వివాహమైంది. ఆ సమయంలో రూ. ఐదు లక్షలను అతడికి కట్నంగా ముట్టజెప్పారు. కొన్ని రోజుల తర్వాత అదనపు కట్నం కోసం కృష్ణప్రియకు వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కృష్ణ ప్రియ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, అత్తమామలు చెబుతున్నారు. అయితే అత్తింటి వారే అదనపు కట్నం కోసం వేధించి తన బిడ్డను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పుట్టింటి నుంచి మరో రూ.12 లక్షలు తెమ్మంటూ భార్యను తరచూ వేధించేవాడని ఆమె బంధువులు చెబుతున్నారు. గర్భం దాల్చిన కృష్ణ ప్రియను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి సీమంతం విషయంలోనూ గొడవ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు కాసుల బంగారం పెడితేనే సీమంతానికి పుట్టింటికి పంపిస్తామని వేధింపులకు గురిచేశారని కన్నీరుమున్నీరయ్యారు. అదపు కట్నం కోసం బిడ్డను అన్యాయంగా బలితీసుకున్నారని కృష్ణ ప్రియ గుండెలవిసేలా రోధిస్తున్నారు. అయితే కృష్ణ ప్రియ భర్త శ్రవణ్‌‌ కుమార్‌, అతని తల్లిదండ్రులు మాత్రం మరోలా చెబుతున్నారు. తాము కృష్ణ ప్రియను వేధింపులకు గురి చేయలేదంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని మాత్రం చెబుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 22, 2020, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading