ఆమె నిండు గర్బిణి.. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివాల్సి ఉంది. కానీ ఈలోపే ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తాను పడుతున్న కష్టాలు.. పుట్టబోయే తన బిడ్డకు ఎందుకని అనుకుందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District)లో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం(Chennur Mandal) ఒత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మిడి లక్ష్మి, రాజమల్లు మొదటి కూతురు దుర్గం రమ్య అలియాస్ లత(24)ను భీమారం(Bheemaram) మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన దుర్గం శేషమ్మ, భూమయ్య దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్‌కు ఇచ్చి గతేడాది క్రితం వివాహం చేశారు.
వివాహ సమయంలో కట్నం(Dowry)గా రూ. 2 లక్షలు, బంగారంతో పాటు ఒత్కులపల్లిలో కొంత భూమి కూడా ఇచ్చారు. అయితే పెళ్లయిన తర్వాత కొద్ది నెలలకే రమ్యకు వేధింపులు మొదలయ్యాయి. భూమిని అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్త, అత్తమామలు రమ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు ఈ సమయంలోనే గర్భం దాల్చింది. ఇక, అదనపు కట్నం(Dowry harassment) కావాలని భర్త తరుచూ రమ్య(Ramya)తో గొడవపడేవాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే రమ్య గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించసాగారు.
Shocking: అతడి వయసు 64, ఆమె వయసు 55.. ఏ భర్త చేయకూడని విధంగా..
దీంతో రమ్య తీవ్ర మనస్తాపం చెందింది. ప్రస్తుతం 8 నెలల గర్భిణీగా ఉన్న రమ్య.. గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగు మందును తాగింది. విషయం తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు భీమారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమ్య మృతి చెందింది. రమ్యను అలా చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారు విలపిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.
ఆమె చేసేది పోలీసు ఉద్యోగం.. ఆ ఒక్క పనితో అడ్డంగా బుక్కయ్యారు.. ఇప్పుడు ఇలా..
ఇక, మృతురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. అత్తమామలు శేషమ్మ, భూమయ్య, భర్త రాజశేఖర్, మరిది రాకేష్‌లపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏసీపీ నరేందర్ తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Dowry, Mancherial, Pregnant women, Suicide