ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. గర్భవతిని చేసి.. ఇంటికి తీసుకెళ్లమంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

9 నెలల క్రితం మనం పెళ్లి చేసుకుందామంటూ శ్రీవాణిని అఖిల్ కోరాడు. దీంతో పెద్దల ప్రమేయం లేకుండానే వివాహం చేసుకున్నారు.

 • Share this:
  సమాజంలో రోజురోజూకీ మృగాళ్లు మహిళలను ఆటబొమ్మల్లాగా చూస్తున్నారు. అన్నిరకాలుగా వాడుకుని అవసరం తీరాక వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు.. ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ యువతి ఒప్పుకునే వరకు ఆమె వెంటే తిరిగాడు. తీరా యువతి అంగీకరించడంతో ఎగిరి గంతేశాడు. నువ్వు లేకుండా నేను బతకలేనంటూ అన్నిరకాలుగా వాడుకున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. యువతిని ప్రైవేటు హాస్టల్ పెట్టి కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఇకనైనా ఇంటికి తీసుకెళ్లమంటూ యువతి పట్టుబట్టడంతో వదిలేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ ఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. షాద్ నగర్ పట్టణానికి చెందిన వడ్ల అఖిల్ ఇదే ప్రాంతానికి చెందిన శ్రీవాణి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నువ్వు లేకుండా నేను బతకలేను.. నువ్వే నా ప్రాణం అంటూ సినిమా డైలాగులు చెప్పగానే యువతి కరిగిపోయింది.

  ఐ లవ్ యూ టూ అంటూ యువకుడి ప్రేమను అంగీకరించింది. దీంతో అప్పటి నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 9 నెలల క్రితం మనం పెళ్లి చేసుకుందామంటూ శ్రీవాణిని అఖిల్ కోరాడు. దీంతో పెద్దల ప్రమేయం లేకుండానే వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అఖిల్ తన ఇంటికి తీసుకెళ్తాడని శ్రీవాణి భావించింది. కానీ అతడు తన ఇంటికి తీసుకెళ్లకుండా బయట హస్టల్స్‌లో ఉంచుతూ కాలం గడుపుతూ వచ్చాడు. అనంతరం కొద్దికాలానికే శ్రీవాణి గర్భం దాల్చింది. ఈ క్రమంలో గర్భం దాల్చిన విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అబార్షన్ చేయించుకోవాలంటూ అఖిల్.. శ్రీవాణిపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

  కానీ అందుకు శ్రీవాణి ఒప్పుకోలేదు. నన్ను ఎన్ని రోజులు బయట ఉంచుతావు.. మీ ఇంటికి తీసుకెళ్లంటూ శ్రీవాణి ప్రశ్నించింది. దీంతో షాద్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకుని కాపురం ప్రారంభించాడు. అయితే గర్భవతి అని తెలిసినా ఏ ఒక్క రోజు శ్రీవాణిని ఆస్పత్రిలో చూపించలేదు. ప్రాణంగా ప్రేమించావని నిన్ను నమ్మి వస్తే ఇలా చేస్తావా.. మీ ఇంటికి తీసుకెళ్తావా లేదా అంటూ శ్రీవాణి తన భర్తను నిలదీసింది. దీంతో అనవసరంగా మాట్లాడితే.. నిన్ను వదిలేస్తానంటూ అఖిల్.. శ్రీవానిని బెదిరించాడు. దీంతో శ్రీవాణికి ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భిణీని అని శ్రీవాణి చెప్పింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు బాధిత యువతికి న్యాయం చేస్తామని తెలిపారు.
  Published by:Narsimha Badhini
  First published: