Home /News /crime /

PREGNANT WOMAN COMMITS SUICIDE IN EAST GODAVARI DISTRICT SSR

కాలేజీ బస్ డ్రైవర్‌తో డిగ్రీ చదువుతున్న యువతి ప్రేమ పెళ్లి.. కానీ ఆమె లైఫ్ ఊహించని విధంగా..

మౌనిక మృతదేహం

మౌనిక మృతదేహం

ప్రేమ పెళ్లి ఆ యువతి పాలిట శాపంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకున్న 14 నెలలకే తనువు చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు నెలల గర్భంతో ఉన్న ఆ యువతి ఉరేసుకుని...

    ఆత్రేయపురం: ప్రేమ పెళ్లి ఆ యువతి పాలిట శాపంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకున్న 14 నెలలకే తనువు చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు నెలల గర్భంతో ఉన్న ఆ యువతి ఉరేసుకుని మృతి చెందింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన మౌనిక(25) రావులపాలెంలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంది. ఆమె చదువుకునే సమయంలో రావులపాలెం నుంచి ర్యాలీకి కాలేజి బస్సులో ప్రయాణించేది. ఆ కాలేజీ బస్సుకు డ్రైవర్‌గా పనిచేసే తాడిపూడి గ్రామానికి చెందిన దంతులూరి గణేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు కూడా అడ్డు చెప్పలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 14 నెలల వరకూ ఈ జంట కాపురం బాగానే సాగింది.

    కొద్దిరోజుల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. గణేష్ కాలేజీ డ్రైవర్‌ ఉద్యోగాన్ని వదిలేసి లారీ డ్రైవర్‌గా వెళుతుండేవాడు. లారీ డ్రైవర్‌గా గణేష్ వెళ్లడం మౌనికకు ఇష్టం లేదు. లారీ డ్రైవర్‌గా వెళుతున్న గణేష్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్న కారణంగా మౌనిక లారీ డ్రైవర్‌గా వెళ్లొద్దని పలుమార్లు వారించింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా గణేష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మౌనిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    మూడు నెలల గర్భంతో ఉన్న మౌనిక చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మౌనిక తల్లిదండ్రులు ఆమె భర్త గణేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని మౌనిక మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Lovers, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు