కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతి అని కూడా చూడకుండా..

రుక్మిణీ రణసింగ్(19), మంగేశ్ రణసింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అహ్మద్‌నగర్‌లోని నిగోట్ గ్రామంలో వారి నివాసం. యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తామని ఊరుకున్నారు.

news18-telugu
Updated: May 8, 2019, 9:35 AM IST
కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతి అని కూడా చూడకుండా..
నమూనా చిత్రం
  • Share this:
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురు, అల్లుడిపై కక్షగట్టాడు. తమకు చెప్పకుండా కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో ఊగిపోయాడు.. కూతురు గర్భవతి అని కూడా చూడకుండా, కాస్త కనికరం కూడా చూపకుండా వారిద్దర్ని ఓ గదిలో బంధించి ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. రుక్మిణీ రణసింగ్(19), మంగేశ్ రణసింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అహ్మద్‌నగర్‌లోని నిగోట్ గ్రామంలో వారి నివాసం. యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తామని ఊరుకున్నారు. కొన్ని రోజులకు రుక్మిణీ గర్భవతి అయ్యింది. తల్లివారింట్లో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని ఆమెను పుట్టింటికి రమ్మన్నారు. ఆనందంతో అక్కడికి వెళ్లిన ఆమెకు అసలు నిజం తెలిసింది. తన తల్లిదండ్రులు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారని గ్రహించింది. ఓ సందర్భంలో ఆ తండ్రి కూతురిపై చేయి చేసుకున్నాడు.

దీంతో, తనను వచ్చి తీసుకెళ్లు అని రుక్మిణి తన భర్తకు ఫోన్ చేసింది. మంగేశ్ అక్కడికి వెళ్లగా అతడ్ని కూడా ఓ రూమ్‌లో బంధించి తాళం వేశారు. యువతి తండ్రి, మేనమామ కలిసి ఇంటికి నిప్పు పెట్టి పారిపోయారు. వీరి ఆర్తనాదాలు విన్న పొరుగింటి వాళ్లు వచ్చి రక్షించి ఆస్పత్రికి తరలించారు. రుక్మిణికి 50 శాతం గాయాలు కాగా, మంగేశ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె తండ్రి, బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...