Home /News /crime /

PREGNANT WOMAN ABDUCTED AND RAPED BY FOUR MEN FOR THREE DAYS IN UP PVN

Shocking : దారుణం..గర్భిణీపై సామూహిక అత్యాచారం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Gang rape on pregnant woman : చిన్నా, పెద్ద, ముసలి, ముతక.. ఆఖరికి నిండు గర్భిణీలను కూడా వదలడం లేదు కామాంధులు. పశువాంఛ తీర్చుకునేందుకు వావి వరసలు మరిచి.. మానవత్వం లేని రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Gang rape on pregnant woman : చిన్నా, పెద్ద, ముసలి, ముతక.. ఆఖరికి నిండు గర్భిణీలను కూడా వదలడం లేదు కామాంధులు. పశువాంఛ తీర్చుకునేందుకు వావి వరసలు మరిచి.. మానవత్వం లేని రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గర్భిణీ(Pregnant Woman) పై నలుగురు సామూహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. మూడు రోజులపాటు తనను బంధించి నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్(UttarPradesh) రాష్ట్రం​లోఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది

రెండు నెలల గర్భిణి అయిన మహిళ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో... మంగళవారం(ఆగస్టు 16) బరేలీ జిల్లా నుంచి బస్సులో బయలుదేరి సహరాన్‌పూర్‌కు వెళ్తుండగా ఫరూఖాబాద్‌లోని బస్‌ టెర్మినల్‌ నుంచి నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసి పొరుగున ఉన్న హర్దోయ్ జిల్లాకు తీసుకెళ్లి . ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారని తెలిపింది. గర్భవతిని నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదని తెలిపింది. శుక్రవారం నిందితులు నిద్రపోతుండగా వారి నుంచి తప్పించుకుని 12 కిలోమీటర్లు నడిచి ఓ గ్రామానికి చేరుకున్నట్లు తెలిపింది. అక్కడ గ్రామస్థులకు జరిగిందంతా చెప్పినట్లు తెలిపింది. అనంతరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఒక పోలీసు బృందం మహిళను బందీగా ఉంచినట్లు ఆరోపించిన ఇంటికి చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న ఒక మహిళ... బాధిత మహిళ యొక్క బంధువులే రూ. 80,000 కోసం ఆమెను అక్కడ వదిలివెళ్లారని పేర్కొన్నారు.



Shocking : ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తకు వీడియో కాల్..పిల్లలకు కూడా విషం తాగించి భర్త ఆత్మహత్య!

ఫరూఖాబాద్ బస్ టెర్మినల్ వద్ద నిందితుడు తన వద్దకు వచ్చినట్లు నిందితుడు మత్తుమందులు వేసిన గుడ్డని తన ముఖం దగ్గర ఉంచడంతో స్పృహతప్పి పడిపోయాను అని బాధితురాలు చెప్పిందని ఫరూఖాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అశోక్ కుమార్ మీనా తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, తాను ఒక ఇంటి గదిలో కనిపించినట్లు ఆ మహిళ చెప్పిందని... పక్కనే కూర్చున్న నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని... అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరించారు అని బాధిత మహిళ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. తాను బందిఖానాలో ఉన్నప్పుడు మూడు రోజులు తినడానికి ఆహారం కూడా ఇవ్వలేదని ఆ మహిళ ఆరోపించినట్లు ఎస్పీ తెలిపారు. ఫరూఖాబాద్, హర్దోయ్ పోలీసులు మహిళను విచారిస్తున్నారని, దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Pregnant women, Rape on women, Uttarpradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు