హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kadapa: భార్య నాలుగు నెలల గర్భంపై భర్త అనుమానం.. పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత...

Kadapa: భార్య నాలుగు నెలల గర్భంపై భర్త అనుమానం.. పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత...

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని అప్పిచ్చిన వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. సదరు ఫోటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు.

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాడని అప్పిచ్చిన వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. సదరు ఫోటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు.

నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది. ఇన్నేళ్లుగా గర్భం దాల్చని లక్ష్మమ్మ ఇప్పుడు గర్భం దాల్చడం ఏంటని నరసయ్య, అతని తరపు వారంతా వేధించసాగారు. నరసయ్యలో అనుమానం మొదలైంది. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఎవరితో వివాహేతర సంబంధం నడుపుతున్నావో చెప్పాలని, కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని నరసయ్య లక్ష్మమ్మతో గొడవ పెట్టుకునేవాడు.

ఇంకా చదవండి ...

కడప: భర్త అనుమానం ఆమె ప్రాణం తీసింది. తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయినా ఆ దంపతులకు పిల్లలు కలగలేదు. నాలుగు నెలల క్రితం ఆమె గర్భం దాల్చడంతో ఆ భర్తలో అనుమానం మొదలైంది. తన భార్య తప్పు చేసిందని.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మూలంగానే ఆమె గర్భం దాల్చిందని భావించాడు. భార్యను తనతో పాటు పొలానికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరు మండలం టంగుటూరు హరిజనవాడకు చెందిన నరసయ్యకు, లక్ష్మమ్మకు తొమ్మిది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా ఈ దంపతులకు సంతానం కలగలేదు. నరసయ్య తరపు బంధువులు, కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను అనరాని మాటలు అనేవారు. సూటిపోటి మాటలు లక్ష్మమ్మకు బాధ కలిగించినా భర్త నరసయ్య పట్టించుకునేవాడు కాదు. అయితే.. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం లక్ష్మమ్మ గర్భం దాల్చింది. ఇన్నేళ్లుగా గర్భం దాల్చని లక్ష్మమ్మ ఇప్పుడు గర్భం దాల్చడం ఏంటని నరసయ్య, అతని తరపు వారంతా వేధించసాగారు. నరసయ్యలో అనుమానం మొదలైంది. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఎవరితో వివాహేతర సంబంధం నడుపుతున్నావో చెప్పాలని, కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని నరసయ్య లక్ష్మమ్మతో గొడవ పెట్టుకునేవాడు. భార్య నిజం చెప్పడం లేదని భావించిన నరసయ్య ఆమెను అంతమొందించాలనుకున్నాడు.

భార్యతో కొన్ని రోజులుగా మంచిగా ఉంటున్నట్లు నటించి తాను మారిపోయాననే భ్రమను ఆమెకు కలిగించాడు. తనను పూర్తిగా భార్య నమ్మిందని ఖాయం చేసుకున్నాక బుధవారం ఉదయం 7 గంటల సమయంలో టంగుటూరులోని తన సొంత మామిడి తోటలోకి లక్ష్మమ్మను తీసుకెళ్లాడు. పొలానికి వెళ్లి మామిడి తోట ఎలా ఉందో చూసొద్దామని తీసుకెళ్లి.. లక్ష్మమ్మతో నాలుగు గంటల పాటు ఆమాటా, ఈమాటా చెప్పి ఉదయం 11 గంటల సమయంలో ఆమెను హత్య చేశాడు.

ఇది కూడా చదవండి: Newly Married: ఏప్రిల్ 3న ఈ ఇద్దరికీ పెళ్లైంది.. పెళ్లయి నెల కూడా గడవలేదు.. ఇంతలోనే అంతా తలకిందులైంది..

లక్ష్మమ్మ తలపై, గొంతుపై దాడి చేసి ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. తమ కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో లక్ష్మమ్మ తల్లిదండ్రులకు అనుమానమొచ్చి నరసయ్యను నిలదీశారు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటంతో అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ మృతదేహాన్ని మామిడి తోటలో గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం లక్ష్మమ్మ మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: AP News, Kadapa, Pregnant women, Wife murdered

ఉత్తమ కథలు