16 ఏళ్ల యువతిని రేప్ చేసిన ముగ్గరు.. గర్భిణి అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు

16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా రేప్‌కు పాల్పడ్డారు. అయితే తను గర్బిణి అని తెలియడంతో బాధిత యువతి వాట్సాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది.

news18-telugu
Updated: October 6, 2020, 8:09 AM IST
16 ఏళ్ల యువతిని రేప్ చేసిన ముగ్గరు.. గర్భిణి అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా రేప్‌కు పాల్పడ్డారు. అయితే తను గర్బిణి అని తెలియడంతో బాధిత యువతి వాట్సాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. గతకొద్ది రోజులుగా యువతి ఆరోగ్యం బాగాలేకపోవడం గమనించిన కుటుంబసభ్యులు ఆరా తీయగా..ఆమె రేప్‌కు గురైనట్టుగా చెప్పింది. దీంతో వారు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె గర్భిణి అని తెలిసింది.

దీంతో బాధిత యువతి పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించింది. దీంతో మహిళా పోలీసు అధికారి నేత‌ృత్వంలోని ప్రత్యేక బృందం బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమె నుంచి వివరాలు సేకరించింది. తనపై ముగ్గరు వ్యక్తులు రేప్ చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. అందులో ఇద్దరు ఏడాదిన్నరగా పలుమార్లు తనను రేప్ చేసినట్టు ఆరోపించింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. అందులో ఓ నిందితుడి వయసు 72 ఏళ్లు.


ఈ ఘటనకు సంబంధించి బులంద్‌షహర్‌ సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ''బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె రేప్ చేసిన వారిలో మొదటి నిందితుడిగా.. 72 ఏళ్ల శ్రీచంద్‌ను, రెండో నిందితుడిగా శ్రీచంద్ తమ్ముడైన 52 ఏళ్ల బల్‌వీర్ను, మూడో నిందితుడిగా పాలు అమ్మే వ్యక్తి మహేష్‌ను పేర్కొంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఆమెను పలుమార్లు రేప్ చేసినట్టుగా తెలిపింది. ఇక, ఏడాది క్రితం బాధితురాలి సోదరుడు ట్రైన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.అయితే ఆ సమయంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న బల్వీర్ వారికి నోయిడాకి చెందిన ఓ ఫామ్ హౌస్ ఓనర్ నుంచి రుణం ఇప్పించాడు. అయితే ఆ రుణం ఇవ్వాల్సిందిగా కోరడంతో ఘర్షణ చోటుచేసుకుందని నిందితుడు బల్వీర్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాం" అని తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: October 6, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading