ప్రియుడి కోసం నిండు గర్భిణి హత్య... భర్తతో వీడియోకాల్ మాట్లాడుతుండగానే...

తమ బంధానికి అడ్డుగా ఉన్న ప్రియుడి భార్యను చంపేందుకు పథకం పన్నిన ప్రేయసి... నిండు గర్భిణి హత్యకు దారి తీసిన భర్త వివాహేతర సంబంధం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 27, 2019, 6:47 PM IST
ప్రియుడి కోసం నిండు గర్భిణి హత్య... భర్తతో వీడియోకాల్ మాట్లాడుతుండగానే...
ప్రియుడి కోసం నిండు గర్భిణి హత్య... (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 27, 2019, 6:47 PM IST
పెళ్లైన వ్యక్తితో అడ్డుగా ఉన్న అతని భార్యను అతి దారుణంగా హత్య చేయించిందో మహిళ. గర్భవతి అని కూడా చూడకుండా... సాటి మహిళపై దారుణంగా ప్రవర్తించింది. ఇదంతా భర్తతో వీడియోకాల్‌లో మాట్లాడుతుండగానే జరగడం కొసమెరుపు. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌కు 8 కి.మీ.ల దూరంలో ఉన్న బగ్గే కీ పిప్పల్ గ్రామంలో 29 ఏళ్ల రవ్‌నీత్ కౌర్... దారుణ హత్యకు గురైంది. చంఢీఘర్ రాష్ట్రానికి చెందిన జస్ప్రీత్ సింగ్‌తో ఆమెకు 2013లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే నాలుగున్నరేళ్ల బాలిక ఉండగా... మళ్లీ ఇప్పుడు కౌర్ గర్భం దాల్చింది. ఉద్యోగనిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన సింగ్... అక్కడే సెటిల్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత అక్కడ కిరణ్ అనే అమ్మాయితో సింగ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే భార్యకు అన్యాయం చేయడం ఇష్టం లేని సింగ్... విడాకులు ఇవ్వడానికి, కిరణ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.

పెళ్లి మాట ఎత్తితే తమ బంధం, సంబంధం ఇక్కడితో ముగిసిపోతుందని అనుమానించేవాడు. దాంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న కౌర్‌ను చంపేయాలని ఫిక్స్ అయ్యింది కిరణ్. పథకం ప్రకారం సింగ్‌తో కలిసి ఇండియాకు వచ్చిన కిరణ్... ఇక్కడ ఉన్న సమయంలో కౌర్ హత్యకు కిరాయి గుండాలతో డీల్ కుదుర్చుకుంది. అనుమానం రాకుండా సింగ్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన తర్వాత ఆమెను చంపాలని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే భర్త ఆస్ట్రేలియా వెళ్లగానే భార్య దారుణహత్యకు గురైంది. భర్తతో వీడియోకాల్‌లో మాట్లాడుతుండగానే ఆమెపై దాడిచేసిన దుండగులు, చంపేసి ఇంటి ముందు పడేసి పోయారు. కౌర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... కిరాయి హంతకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కౌర్‌కు ఆస్ట్రేలియా వీసా కూడా వచ్చింది. తర్వలోనే ఆమె భర్త దగ్గరికి వెళ్లడానికి రెఢీ అవుతుండగా దారుణం జరగడం విశేషం.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...