విషాదం.. విద్యుత్ షాక్‌తో గర్భిణీ మృతి..

రాత్రి సమయంలో ఉక్కపోతగా ఉండడంతో అనిత నిద్ర లేచి ఫ్యాన్ వేసేందుకు స్విచ్ వేయబోయింది. అయితే స్విచ్ బోర్డుపై వైర్లు తేలి ఉండడంతో అనితకు విద్యుత్ షాక్ కొట్టింది.

news18-telugu
Updated: July 9, 2020, 9:05 AM IST
విషాదం.. విద్యుత్ షాక్‌తో గర్భిణీ మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఓ గర్భిణీ మృతిచెందింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తండాలో నునావత్ అనిత(26) పంచాయతీలో వార్డు సభ్యురాలు. రోజువారీలాగే ఇంటిలో భర్త, పిల్లలతో కలిసి నిద్రపోయారు. రాత్రి సమయంలో ఉక్కపోతగా ఉండడంతో అనిత నిద్ర లేచి ఫ్యాన్ వేసేందుకు స్విచ్ వేయబోయింది. అయితే స్విచ్ బోర్డుపై వైర్లు తేలి ఉండడంతో అనితకు విద్యుత్ షాక్ కొట్టింది. విద్యుత్ షాక్‌తో అనిత చేతివేళ్లు కాలిపోవడంతో కుప్పకూలిపోయింది. అలికిడికి భర్త పిల్లలు లేచి చూసేరికి అనిత చనిపోయి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త బల్‌రాం, కూతురు మీనాక్షి, వర్షిత ఉన్నారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 9:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading