అప్పుడు ఏనుగు.. ఇప్పుడు గర్భంతో ఉన్న ఆవు నోట్లో పేలిన బాంబ్...

ఇప్పుడు గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఝాందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: June 6, 2020, 2:13 PM IST
అప్పుడు ఏనుగు.. ఇప్పుడు గర్భంతో ఉన్న ఆవు నోట్లో పేలిన బాంబ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేరళలోని పాలక్కడ్‌లో గర్భంతో ఉన్న ఏనుగు నోట్లో బాంబు పేలడంతో అది తీవ్రమైన వేదన అనుభవించి చివరకు కన్నుమూసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఏనుగును చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న ఝాందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. బాంబు పేలుడు ధాటికి ఆవు దవడలు మొత్తం పగిలిపోయాయి. నోటి నుంచి వేలాడుతున్నాయి. ఆ ఆవు యజమాని గురుదయాళ్ సింగ్  తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడదని సింగ్ ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్ పారిపోయాడని తెలిపాడు. నోటిలో బాంబు పేలడంతో ఆవు నోటి నుంచి తీవ్రంగా రక్తం కారుతోంది. కనీసం ఏమీ తినలేని, తాగలేని విధంగా ఉంది. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు బాధితుడు గురుదయాళ్ సింగ్ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
First published: June 6, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading