హోమ్ /వార్తలు /క్రైమ్ /

నాలుగు రోజులుగా కూతురు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు.. కారణం ఏంటంటే..

నాలుగు రోజులుగా కూతురు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh:  కూతురు శరీరంపై అంతుచిక్కని ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. ఇవి శరీరం అంతట వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఇంట్లోనే వైద్యం చేశారు.

మనదేశం అన్ని రంగాల్లో వినూత్న రీతిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాలలో, యువత దూసుకుపోతుంది. రోజువారి జీవితంలో అనేక మార్పులు వస్తున్నాయి. కొత్త పద్దతులను అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో భూతాలు, మంత్రాలు, బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ అంటూ వింత పొకడలకు పోతున్నారు. మరికొంత మంది ఇప్పటికి దొంగ బాబాలు చెప్పింది విని.. అడ్డమైన పనులు చేస్తున్నారు. మరికొంత మంది అతిగా మూఢనమ్మకాలు పాటిస్తుంటారు. దీంతో వీరు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో నిలుస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  జరిగింది. ప్రయాగ్ రాజ్ జిల్లా లోని దీహ గ్రామంలో ఘటన వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా..కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంభవించింది. అభయ్ దాస్ యాదవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో.. వీరంతా అతిగా మూఢ నమ్మకాలను పాటిస్తుంటారు. సంవత్సరాల తరబడి ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఒకే పూట భోజనం చేస్తుంటారు.

అంతే కాకుండా.. కొన్నిసార్లు కేవలం నీళ్లు తాగి మాత్రమే ఉండేవారు. ఈ క్రమంలో.. వీరు మూఢ విశ్వాసాలను చుట్టుపక్కల వారంతా వింతగా చెప్పుకునే వారు. అయితే, వీరి ఇంట్లో 17 ఏళ్ల బాలికకు సెఫ్టిసిమాయా అనే వ్యాధిసోకింది. మూఢ నమ్మకాలతో ఆమెకు ఇంట్లోనే వైద్యం అందించారు.

అది వికటించి బాలిక (Girl death) నాలుగు క్రితంచనిపోయింది. అయితే.. తమ కూతురిని దేవుడు తిరిగి బతికిస్తాడని, వీరు వింతగా ప్రవర్తించారు. అడ్డుచెప్పిన కుటుంబ సభ్యుడు అభయ్ దాస్ ను మిగతా వారు గదిలో బంధించారు. ఈ క్రమంలో.. వీరి ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన బైటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిపై కేసు నమోదుచేశారు. ఇంట్లో శవం ఉండటాన్ని గమనించారు. వెంటన శవాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. బాలిక కుటుంబ సభ్యులను అదుపులోనికి తీసుకుని విచారించగా.. తమ కూతురిని దేవుడు తిరిగి బతికిస్తాడని అన్నారు. వీరి వాదన విని పోలీసులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

First published:

Tags: Crime news, Minor girl, Uttar pradesh

ఉత్తమ కథలు