మరదలితో కారులో శృంగారం, ఆ తర్వాత కత్తితో అతిదారుణంగా... పెళ్లైన బావ ఘాతుకం...

పొల్లాచ్చి ప్రగతి హత్యకేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి... బావతో వివాహేతర సంబంధం కొనసాగించిన ప్రగతి, 10 సవర్ల బంగారం కొనిపించుకుని, మరో 10 సవర్లు కొనివ్వాలంటూ డిమాండ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 8:04 PM IST
మరదలితో కారులో శృంగారం, ఆ తర్వాత కత్తితో అతిదారుణంగా... పెళ్లైన బావ ఘాతుకం...
మరదలిని రేప్ చేసి, ఆ తర్వాత కత్తితో అతిదారుణంగా... పెళ్లైన బావ ఘాతుకం...
  • Share this:
తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ఏరియాలో విద్యార్థ ప్రగతి హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. కోయంబత్తూరు జిల్లాలోని ఆవారం పాళయంలోని కోవై కాలేజ్‌లో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల ప్రగతికి త్వరలో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రగతికి వరుసకు బావ అయ్యే ఒట్టన్ చత్రం ఏరియాకు చెందిన 27 ఏళ్ల సతీశ్... చిన్నతనం నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ప్రగతి కుటుంబసభ్యులను కలిసి పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన కూడా తెచ్చాడు. అయితే అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ సంఘటన తర్వాత మరదలి కోసం మూడేళ్ల పాటు వేచి చూసిన సతీశ్... కొన్నినెలల క్రితం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా ప్రగతితో చనువుగా మెలిగేవాడు సతీశ్. బావతో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రగతి కూడా... అతనితో తన అవసరాలు తీర్చుకునేది. అయితే కొన్నిరోజుల క్రితం ప్రగతికి సంబంధం కుదిరింది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి, పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. కాలేజ్ ముగిసిన తర్వాత పెళ్లి షాపింగ్‌కు వెళ్లాలని ఫిక్స్ అయిన ప్రగతి, ఆ సమయంలో అక్కడికి వచ్చిన సతీశ్ కారు ఎక్కింది. ఇద్దరూ కలిసి కారులో తిరుగుతూ పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా బావతో శారీరక సంబంధం కొనసాగస్తూ వచ్చిన ప్రగతి, అతనితో పది సవర్ల బంగారం, ఖరీదైన చీరలు కొనిపించుకుంది. పెళ్లి కుదిరిన తర్వాత మరో పది సవర్లు కొనివ్వాలని అతడిని అడిగింది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చేందుకు కూడా డబ్బులు ఇవ్వాలని బావను కోరింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన సతీశ్... ఆమెపై కత్తితో దాడి అతికిరాతకంగా చంపేశాడు.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రగతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన సతీశ్... భార్య గర్బవతి అని తెలిసిన తర్వాత మరదలిని కలవడం తగ్గించాడు. బిడ్డ పుట్టిన తర్వాత మరదలితో చాలా తక్కువగా మాట్లాడేవాడు. అయితే బావను వదలడం ఇష్టం లేని ప్రగతి... పెళ్లి చేసుకున్నా, అతనితో సంబంధం కొనసాగిస్తానని చెప్పింది. తరుచూ ఫోన్ చేస్తూ మరో పది సవర్ల బంగారం కావాలని డిమాండ్ చేసింది. దాంతో ప్రగతి వల్ల తన కుటుంబంలో గొడవలు వస్తాయేమోననే భయం పట్టుకుంది సతీశ్‌కు. దాంతో మరదలిని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన సతీశ్, ప్రగతితో కలిసి కారులోనే ఎంజాయ్ చేశాడు. శారీరకంగా కోరిక తీర్చుకున్న తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేసి చంపేశాడు. గొంతు కోసేటప్పుడు చేతిని అడ్డుపెట్టుకుంది ప్రగతి. దాంతో ఆమె చేతివేళ్లు తెగిపడ్డాయి. కత్తితో ప్రగతి శరీరంపై మూడుచోట్ల పొడిచి చంపిన సతీశ్... తర్వాత ఆమెను అర్ధనగ్నంగానే చెట్లపొదల్లో పడేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సీసీటీవీ కెమెరాల ఆధారంగా రెండు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

First published: April 9, 2019, 8:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading