హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆ బాలుడికి 10 ఏళ్లు.. ఉరివేసుకోవడం ప్రాక్టీస్ చేశాడు.. ప్రమాదవశాత్తు ఉరి మెడకు బిగుసుకొని చనిపోయాడు.. అసలేం జరిగిందంటే..

ఆ బాలుడికి 10 ఏళ్లు.. ఉరివేసుకోవడం ప్రాక్టీస్ చేశాడు.. ప్రమాదవశాత్తు ఉరి మెడకు బిగుసుకొని చనిపోయాడు.. అసలేం జరిగిందంటే..

Custodial Death : బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?

Custodial Death : బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?

Crime News: స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి ప్రదర్శించాల్సిన నాటకాన్ని సాధన చేస్తూ 10 ఏళ్ల బాలుడు మరణించాడు. ఆగస్టు 15న భగత్ సింగ్ నాటకాన్ని వేసేందుకు సిద్ధమైన విద్యార్థులు రిహార్సల్స్ చేస్తుండగా ఉరివేసుకునే సీన్ ప్రాక్టీస్ లో అతడికి నిజంగా మెడకు తాడు బిగుసుకోవడంతో చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ఆ పాఠశాల విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించేందుకు ఒప్పుకున్నడు. అందులో భగత్ సింగ్ నాటకాన్ని వేసేందుకు సిద్ధమైన విద్యార్థులు రిహార్సల్స్ చేస్తున్నారు. 10 సంవత్సరాల విద్యార్థి అందుకు తగ్గట్లు సిద్ధమయ్యాడు. భగత్ సింగ్ ను ఉరేసిన సీన్ కోసం ఇంటి పైకప్పుకు ఉరితాడును కట్టాడు. కింద స్టూల్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బాలుడు స్టూలు పైకి ఎక్కి ఉరితాడును మెడకు బిగించుకున్నాడు. ప్రాక్టీస్ లో భాగమని స్టూల్ ను తన్నగా.. ఉరితాడు నిజంగానే గొంతుకు బిగుసుకుపోయింది. దీంతో తోటి విద్యార్థులు అతడు కాళ్లు ఊపుతుంటే ప్రాక్టీస్ లో భాగమే అనుకున్నారు. తర్వాత భయమేసి కేకలు వేశారు. చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని బుడౌన్ జిల్లా బాబాత్ గ్రామంలో చోటుచుసుకుంది. ఈ ఘటన జూలై 29 న జరగ్గా విద్యార్థి తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్కూల్ టీచర్లు.. ఇతర విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కడంతో జాతీయ మీడియా సైతం స్పందించింది. దీంతో జిల్లా పోలీసులు స్వచ్ఛందంగా విచారణ జరపగా ఘటన జరిగింది నిజమేనని తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బాబాత్ గ్రామానికి చెందిన విద్యార్థులు ఆగష్టు 15 న పాఠశాలలో ప్రదర్శించే భగత్ సింగ్ జీవిత కథ నాటకం రిహార్సల్ చేస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన భూరేసింగ్ కొడుకు శివమ్ తన మిత్రులతో కలసి ఉరితీసే సన్నివేశం కోసం ఉరితాడును రెడీ చేయించుకున్నారు. ఆ తాడు గట్టిగా ఉందా లేదా అని దానిని చెక్ చేసేందుకు శివమ్ స్టూలుపైకి ఎక్కాడు. దీంతో అది ప్రమాదవశాత్తు మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. అక్కడే ఉన్న విద్యార్థులు కాళ్లను ఆడిస్తుండగా.. భయంతో వాళ్లు కేకలు వేశారు. ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి చూడగా బాలుడు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు.

అతడిని అక్కడ నుంచి దించి చూడగా అప్పటికే ఆ బాలుడి ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కన్నీటిపర్యతం అయ్యింది. తమ కొడుకు శివమ్ భగత్ సింగ్ లా నాటక ప్రదర్శన కోసం ఉరేసుకునే సీన్ రిహార్సల్ చేస్తూ చనిపోయాడన్న విషయం తెలుసుకుని తల్లిదండ్రులు భోరున విలపించారు. తండ్రి భూరేసింగ్ ఆధ్వర్యంలో బంధుమిత్రులు కలసి బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఆ రోజు విషయాన్ని వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత అక్కడ జరిగింది చాలామందికి తెలియడంతో జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించి విచారణ చేయించారు. విచారణలో ఘటన జరిగింది వాస్తవమే అని తేలింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.

First published:

Tags: Crime, Lucknow, School boy, Uttarapradesh

ఉత్తమ కథలు