హోమ్ /వార్తలు /crime /

కనిపించకుండా పోయిన పోస్టాఫీస్ ఉద్యోగిని.. నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి తెలిసిన షాకింగ్ న్యూస్..

కనిపించకుండా పోయిన పోస్టాఫీస్ ఉద్యోగిని.. నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి తెలిసిన షాకింగ్ న్యూస్..

పోస్టాఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

పోస్టాఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

పోస్టాఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

    పోస్టాఫీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. గ్వాలియర్‌లో నివాసం ఉంటున్న రీతూ కసేరియా పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త యోగేష్ కుమార్ డాక్టర్‌గా ఉన్నారు. యోగేష్ గ్వాలియర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం బిహార్‌లోని పాట్నాలో పీజీ చేస్తున్నాడు. రీతూ, యోగేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం ఆనందంగా ముందుకు సాగుతోంది.

    అయితే జూన్ 10వ తేదీన రీతూ భర్తతో మొబైల్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఇంటికి తిరిగి చేరుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసిన యోగేష్ వెంటనే.. పాట్నా నుంచి గ్వాలియర్ చేరుకున్నాడు. ఆమె ఆచూకీ కోసం ఎంత గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దీంతో రీతూ కుటుంబ సభ్యులు ఝాన్సీ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించిన ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు.

    మరోవైపు రీతూ కనిపించకుండా పోయిన నాలుగు రోజుల తర్వాత గుణ జిల్లాలోని మైనా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహాం లభించందనే విషయం రీతూ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వెంటనే రీతూ భర్త యోగేష్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె ఫేస్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటుగా, శరీరం ఆరు ముక్కలుగా పడి ఉందని చెప్పారు. జూన్ 10వ తేదీన మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించినట్టుగా వెల్లడించారు. అయితే మృతదేహం ఉన్న దుస్తులు.. రీతూ ఇంట్లో నుంచి కనిపంచకుండా వెళ్లిన సమయంలో ధరించిన దుస్తులేనని యోగేష్ గుర్తించాడు. ఆ మృతదేహం రీతూదేనని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక, పోలీసు చర్యలు తర్వాత ఆ మృతదేహాన్ని రీతూ కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో రీతూ దృశ్యాలు..

    రీతూ గురించి గాలించిన పోలీసులకు.. హరిశంకపూరమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ఆమె కనిపించింది. ఆ తర్వాత ఆమె రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్నట్టు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె స్టేషన్‌లో ఉన్న దృశ్యాలు, గుణ వైపు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్‌పై లభించిన మృతదేహం రీతూదేనని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు.

    అయితే రీతూ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది?, ఆమె గ్వాలియర్ నుంచి గుణకు ఎందుకు బయలుదేరింది?, అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడం.. ఇలా అనేక రకాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో రీతూ సూసైడ్ చేసుకుందని నిర్దారించలేమని.. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

    First published:

    ఉత్తమ కథలు