Home /News /crime /

POSSESSIVE OF SISTER IN LAW MAN KILLS HER HIS WIFE TWO CHILDREN MOTHER IN LAW LATER ENDS HIS OWN LIFE IN NAGPUR SU

మరదలిపై కన్నేసిన బావ.. ఐదు హత్యలు.. మృతదేహంతో శృంగారం.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి భార్య, పిల్లలతో సహా ఐదుగురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఓ వ్యక్తి భార్య, పిల్లలతో సహా ఐదుగురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. గోలిబార్ చౌక్ సమీపంలోని బాదల్ కా అఖాడా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రెండు వేర్వేరు ఇళ్లలో నివాసం ఉంటున్న మొత్తం ఐదుగురిని నిందితుడు కొద్ది గంటల వ్యవధిలోనే దారుణంగా హత్య చేశాడు.వివరాలు.. నిందితుడు మాతుర్కర్.. విజయ అనే మహిలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు సాహిల్, కుమార్తె పారి ఉన్నాడు. విజయ చెల్లెలు అమీషా.. కొంతకాలం క్రితం మాతుర్కర్‌కు టైలరింగ్‌లో సహాయం చేసింది.

    అయితే అమీషా వేరే వారితో మాట్లాడితే.. మాతుర్కర్ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం ఆమె మాతుర్కర్ వద్ద పని మానేసింది. మాతుర్కర్ వేధింపులపై ఏప్రిల్‌లో అమీషా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా మాతుర్కర్.. ఈ విషయంపై భార్య, అమీషాలతో గొడవపడినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాతుర్కర్.. తన భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న విజయ తల్లి ఇంటికి వెళ్లాడు. విజయ తల్లితో పాటు, చెల్లి అమీషాను హత్య చేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహానికి కొద్ది దూరంలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఇక, వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మాతుర్కర్ మామ దేవీదాస్ మద్యం మత్తులో ఉండి.. తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నాడు. భార్య, కూతురు ఇంకా నిద్రలేవదని భావించి.. మరో కూతురు విజయ ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి కిటికీల్లో నుంచి ఇంట్లో మృతదేహాలను గుర్తించిన స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తునచేరుకున్నారు. దీంతో ఈ విషయం ఇంట్లో చెబుదామని వచ్చేసరికి తన భార్య, కూతురు కూడా చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు.

    ఇక, ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాతుర్కర్ ఇంట్లో అతని భార్య మృతదేహం అర్దనగ్నంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, మరోవైపు విజయ తల్లి, సోదరిలను వేర్వేరు గదుల్లో గొంతుకోసి హత్య చేసినట్టుగా తేల్చారు. ఇక, అమీషా మృతదేహంతో మాతుర్కర్ శృంగారంలో పాల్గొనట్టుగా తేలింది. ఆమె మృతదేహాన్ని నగ్నంగా కనిపించింది. కెమికల్ అనలిస్టులు పరీక్షలు నిర్వహించగా.. అమీషా శరీరంలో వీర్యం ఉన్నట్టు తేలింది. అయితే హత్యకు గురైన వాళ్లు తినే ఆహారంలో మాతుర్కర్ మత్తు మందు కలిపి ఉంటాడని.. అందుకే హత్య జరిగే సమయంలో వారు అరవలేకపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మాతుర్కర్ తొలుత అమీషా, ఆమె తల్లిని హత్య చేసి.. ఆ తర్వాత భార్య, పిల్లల్ని చంపి ఉంటాడని ఓ వాదన నడుస్తుండగా.. ముందుగా భార్య, పిల్లల్ని చంపి.. ఆ తర్వాత అత్తింటికి వెళ్లి మరదలు, అత్తను హత్య చేసి ఉంటాడన మరో వాదన కూడా వినిపిస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Maharashtra, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు