దెయ్యం వదిలించాలని.. భార్యను మాంత్రికులతో రేప్ చేయించిన భర్త..

షేక్ మూసా బవరీజ్ అనే మాంత్రికుడిని కలిస్తే దీనికి పరిష్కారం చెబుతాడని అతని తండ్రి చెప్పాడు. దీంతో అతను షేక్ మూసా బరీజ్‌ను సంప్రదించాడు.

news18-telugu
Updated: October 19, 2019, 3:30 PM IST
దెయ్యం వదిలించాలని.. భార్యను మాంత్రికులతో రేప్ చేయించిన భర్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో ఓ వివాహిత పట్ల జరిగిన దారుణం చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరి మధ్య చాన్నాళ్లుగా గొడవలు జరుగుతుండటంతో.. ఆమె భర్త ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు.ఆమెలో దెయ్యం ఉందని చెప్పిన ఆ మాంత్రికుడు.. దాన్ని పోగొట్టాలని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో మాంత్రికుడిని ఆశ్రయించగా.. అతనూ ఆమెపై అత్యచారానికి
పాల్పడ్డాడు. ఇటీవల బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి రావడంతో.. అతని సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహితకు,ఆమె భర్తకు తరుచూ గొడవలయ్యేవి. ఆమెకు దెయ్యం పట్టడం వల్లే భర్తతో తరుచూ గొడవ పడుతోందని అత్తింటివారు భావించారు. షేక్ మూసా బవరీజ్ అనే మాంత్రికుడిని కలిస్తే దీనికి పరిష్కారం చెబుతాడని అతని తండ్రి చెప్పాడు. దీంతో అతను షేక్ మూసా బరీజ్‌ను సంప్రదించాడు. అతని భార్యను పరిశీలించిన సదరు మాంత్రికుడు.. ఆమెను దెయ్యం ఆవహించిందని చెప్పాడు. దెయ్యాన్ని పోగొట్టాలంటే.. ముందు దాన్ని తృప్తి పరచాలని చెప్పాడు. ఆ ముసుగులో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనికి అత్తింటివారు కూడా సహకరించారు. పైగా ఆ తతంగం మొత్తాన్ని భర్త వీడియో తీశాడు.

ఇది జరిగిన మూడు నెలల తర్వాత కూడా భార్యతో అతనికి గొడవలు జరగడం ఆగలేదు. దీంతో అతను మరో మాంత్రికుడిని సంప్రదించాడు.అతనూ షేక్ మూసా బరీజ్ లాగే.. ఆమెలో దెయ్యం ఉందని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇది జరిగిన మరికొద్దిరోజులకు మరో మాంత్రికుడిని సంప్రదించగా.. అతనూ అదే చేశాడు. ఏడాది కాలంలో ఇలా ముగ్గురు మాంత్రికులు ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారాలపై బాధితురాలు ప్రతిఘటించినప్పుడల్లా.. ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడుతానని భర్త బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇటీవల బాధితురాలి తండ్రి ఒమన్ నుంచి తిరిగి రావడంతో.. అతనికి విషయం చెప్పింది. తండ్రి సహాయంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి సదరు మాంత్రికులపై కేసు నమోదు చేసింది. పోలీసులు వారిపై 354B,376,417,420సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading