అమ్మాయిలనుకొని వీడియో కాల్ చేశారు.. నగ్నంగా దొరికిపోయారు.. ఇప్పుడు లబోదిబో

ప్రతీకాత్మక చిత్రం

ఫోన్‌లో సన్నిహితంగా మాట్లాడి.. వీడియో కాల్స్‌లో నగ్నంగా మారాలని పురుషులను ప్రేరేపిస్తారు. ఆ వీడియో కాల్స్‌ను రికార్డు చేసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు.

  • Share this:
సామాజిక మాధ్యమాల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. వీటి పుణ్యమాని మోసగాళ్లు పెరిగిపోతున్నారు. అమాయకులకు గాలం వేసి డబ్బు కోసం వేధిస్తున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు మహిళలుగా నటించి 100 మంది మగవాళ్లను బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన పుణెలో జరిగింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళలుగా నటించి మగవారి దగ్గర డబ్బు లాగాలని నిర్ణయించుకున్నారు. తమపై ఎక్కడా అనుమానం రాకుండా.. నగ్నంగా ఉన్న వీడియోలను పంపాలని పురుషులను ప్రేరేపిస్తున్నారు. అనంతరం వాటిని అడ్డంపెట్టుకొని డబ్బు డిమాండ్ చేస్తున్నారు.

పట్టుబడిన ఇద్దరూ సోషల్ మీడియాలో మహిళలుగా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ.. మగవాళ్లతో స్నేహం చేయడం మొదలుపెడుతున్నారు. ముందు తమతో మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారిని గుర్తిస్తారు. ప్రణాళిక ప్రకారం తమ ఫోన్ నెంబర్లను వారితో పంచుకుంటారు. అనంతరం ఫోన్‌లో సన్నిహితంగా మాట్లాడి.. వీడియో కాల్స్‌లో నగ్నంగా మారాలని పురుషులను ప్రేరేపిస్తారు. ఆ వీడియో కాల్స్‌ను రికార్డు చేసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను పుణె పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. "కొన్ని రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత పురుషుల ఫోన్ నెంబర్లను తీసుకుంటారు. అనంతరం సౌండ్ మాడ్యూలేటింగ్ సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించి మహిళల మాదిరిగా నటిస్తారు. అనంతరం నగ్నంగా ఫోజులిచ్చి వారిని నమ్మిస్తారు. వాస్తవానికి వేరే మహిళల వీడియోలను వీరు ప్లే చేస్తారు. అనంతరం బాధితులను కూడా నగ్నంగా వీడియోలు పంపాలని బలవంతం చేస్తారు" అని ఆయన అన్నారు. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం 100 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

తాము సేకరించిన వీడియోలను ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి ఒక్కొక్కరి దగ్గర రూ.3,000 నుంచి రూ. 25,000 వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించి, అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసేందుకు పుణె పోలీసుల బృందం రాజస్థాన్ కు వెళ్లింది. అయితే ఇలాంటి కేసుకు సంబంధించి ఇద్దరిని ఇప్పటికే రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసినట్లు వారికి తెలిసింది. వారిని పుణెకు తీసుకువచ్చేందుకు త్వరలోనే ఈ బృందం రాజస్థాన్ పోలీసులను ఆశ్రయించనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: