దిశ అత్యాచారం, హత్య ఘటనపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యల చేశారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉంటుందని తాను భావించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో అందరూ అవినీతిగా ఉంటూ, ఒక్కసారిగా ఇలా నీతిగా ఉండాలంటే ఎవరు, ఎలా ఉంటారు అని ప్రశ్నించారు. మానవ మృగాలు మనదేశంలో కోట్ల మంది ఉన్నారని అన్నారు. మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాం, ఎలాంటి వారికి అవకాశం ఇస్తున్నామనే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని అన్నారు.
దిశ ఘటనలో నలుగురికి ఉరిశిక్ష వేస్తే వాళ్లు అప్పుడే చనిపోతారని... కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పటిలాగే జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. దిశ ఘటనపై ఇంత ఆందోళన అవసరం లేదని... వ్యవస్థలో మార్పు రావాలని అంతా కోరుకోవాలని పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.