అమెరికాలో పోర్నోగ్రఫీ... 22 మంది మహిళలకు షాక్...

USA : పోర్నోగ్రఫీ అనేది పెద్ద మాఫియా. అమెరికా లాంటి దేశంలో దీనికి చట్టబద్ధత ఉండటంతో... దాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాయి కొన్ని గ్యాంగులు.

news18-telugu
Updated: January 5, 2020, 6:22 AM IST
అమెరికాలో పోర్నోగ్రఫీ... 22 మంది మహిళలకు షాక్...
పోర్న్ సినిమాలు (Porn Movies)
  • Share this:
అమెరికాలో... కాలిఫోర్నియా ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ అభివృద్ధి మాటున అక్రమాలు, నేరాలు కూడా బాగానే జరుగుతున్నాయి. అక్కడి శాండియాగోలోని ఓ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్... ఓ యాడ్ వేసింది. తమకు కొంత మంది మహిళలు కావాలనీ... వాళ్లతో పోర్నోగ్రఫీ చేయించుకుంటామనీ... ఆ వీడియోలు, ఫొటోలను మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టబోమని యాడ్‌లో తెలిపింది. అంతేకాదు... పోర్నోగ్రఫీలో పాల్గొనేవారి వీడియోలను అమెరికాలో కాకుండా... విదేశాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులకు మాత్రమే చూపిస్తామని హామీ ఇచ్చింది. పోర్నోగ్రఫీలో పాల్గొనేవారికి భారీ ఎత్తున డబ్బు ఇస్తామని చెప్పింది. అమెరికాలో చాలా మంది డబ్బు కోసం పోర్నోగ్రఫీ రూట్ ఎంచుకుంటున్నారు. అదే క్రమంలో... ఈ యాడ్ చాలా మందికి నచ్చింది. ఈ డీల్ కుదుర్చుకున్నా... తమ ప్రైవసీకి ఎలాంటి సమస్యా ఉండదులే అనుకున్న మహిళలు... డీల్ కుదుర్చుకున్నారు. వాళ్లతో పోర్నోగ్రఫీ చేయించిన ఆ వెబ్‌సైట్... వీడియోలూ, ఫొటోలూ తీసుకుంది. డీల్ ప్రకారం మనీ ఇచ్చేసింది. మేటర్ సెటిలైపోయింది.

పోర్నోగ్రఫీలో పనిచేసిన ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో... ఆ వెబ్‌సైట్‌లో కొన్ని రోజుల తర్వాత కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ... రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారని అడిగింది. రూల్స్ బ్రేక్ చెయ్యలేదు. అనుకోకుండా అది అందులోకి వచ్చిందని నాటకాలాడింది ఆ వెబ్‌సైట్ యాజమాన్యం. ఐతే... షాకింగ్ విషయమేంటంటే... ఈ డీల్ కుదర్చుకున్న 22 మంది మహిళల వీడియోలూ, ఫొటోలు కూడా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. అందరూ షాకయ్యారు. అందరూ ప్రశ్నించారు. అందరికీ ఇలాగే అనుకోకుండా జరిగిందని చెప్పింది.

అమెరికాలో మహిళలు చాలా ఫాస్ట్ కదా. వెంటనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు దర్యాప్తు జరిపించింది. బాధితులు చెప్పిందే నిజమని నమ్మింది. ఆ వెబ్‌సైట్‌కి ఆదేశాలిచ్చింది. వెంటనే ఆ మహిళల వీడియోలు, ఫొటోల్ని సైబర్ క్రైమ్ టీమ్ ద్వారా డిలీట్ చేయించింది. అలాగే... ఆ మహిళల పరువు తీసినందుకు... రూ.91 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం ఒక్కో బాధిత మహిళకూ రూ.4 కోట్ల దాకా పరిహారం అందనుంది.
Published by: Krishna Kumar N
First published: January 5, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading