పోర్న్ సైట్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. ఇండియాలో బ్యాన్ చేసినా..

ఎన్ని చట్టాలు వస్తున్నా, నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నా పోర్న్ వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయలేకపోతోంది కేంద్ర ప్రభుత్వం. పోర్న్ హబ్, రెడ్ ట్యూబ్ అలాంటి సైట్లు.. తమ సైట్ల టాప్ లెవల్ డొమైన్ పేర్లను మార్చి మళ్లీ భారత్‌లోకి ప్రవేశించాయి.

news18-telugu
Updated: October 2, 2019, 5:15 PM IST
పోర్న్ సైట్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. ఇండియాలో బ్యాన్ చేసినా..
నమూనా చిత్రం
  • Share this:
పోర్న్, అశ్లీల దృశ్యాలు చూపించే 857 వెబ్‌సైట్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవి చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని, వాటిని వెంటనే నిషేధించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వీటిపై కొరడా ఝులిపించింది. వాస్తవానికి.. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఓ రేప్ ఘటనతో అశ్లీల వెబ్ సైట్లను నిషేధించాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ హైకోర్టులో రేప్ కేసు విచారణ జరిగింది. ఈ ఘటనలో ఓ స్కూల్ అమ్మాయిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కోర్టుకు హాజరైన బాలుడు... రేప్ చేసే ముందు పోర్న్ వెబ్ సైట్లు చూశానని తెలిపాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతున్న ఇలాంటి సైట్లను నిషేధించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.

అయితే, ఎన్ని చట్టాలు వస్తున్నా, నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నా పోర్న్ వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయలేకపోతోంది కేంద్ర ప్రభుత్వం. పోర్న్ హబ్, రెడ్ ట్యూబ్ అలాంటి సైట్లు.. తమ సైట్ల టాప్ లెవల్ డొమైన్ పేర్లను మార్చి మళ్లీ భారత్‌లోకి ప్రవేశించాయి. .కామ్‌ స్థానంలో .ఆర్గ్, .నెట్ పేర్లతో చలామణి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ సైట్లు వీపీఎన్, బ్రౌజర్లు, ప్రోక్సీ అడ్రస్, తదితరాలను మార్చకుండానే అవి నడుస్తున్నాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 2, 2019, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading