Home /News /crime /

Online Class: ఆన్‌లైన్ క్లాస్‌లో 65 మంది ఉండగా సడన్‌గా ఆ వీడియో ప్రత్యక్షం.. ఆ దృశ్యాలు, సౌండ్లు విని..

Online Class: ఆన్‌లైన్ క్లాస్‌లో 65 మంది ఉండగా సడన్‌గా ఆ వీడియో ప్రత్యక్షం.. ఆ దృశ్యాలు, సౌండ్లు విని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముంబైకి చెందిన ఓ కాలేజీ ఆన్‌లైన్‌లో క్లాసు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులను విద్యార్థులు శ్రద్ధగా ఉంటున్నారు. దాదాపు 65 మందికి పైగా ఆ వీడియో కాల్‌లో భాగమయ్యారు. వీరిలో విద్యార్థులు, గెస్ట్ లెక్చరర్స్, కాలేజీ ఫ్యాకల్టీ చూస్తుండగా ఉన్నట్టుండి ఆ ఆన్‌లైన్ క్లాస్ వీడియోలో పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది.

ఇంకా చదవండి ...
    ముంబైకి చెందిన ఓ కాలేజీ ఆన్‌లైన్‌లో క్లాసు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులను విద్యార్థులు శ్రద్ధగా ఉంటున్నారు. దాదాపు 65 మందికి పైగా ఆ వీడియో కాల్‌లో భాగమయ్యారు. వీరిలో విద్యార్థులు, గెస్ట్ లెక్చరర్స్, కాలేజీ ఫ్యాకల్టీ చూస్తుండగా ఉన్నట్టుండి ఆ ఆన్‌లైన్ క్లాస్ వీడియోలో పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలకు, వస్తున్న శబ్దాలను విని అందరికీ దిమ్మతిరిగింది. దీంతో.. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. హ్యాకర్లు ఎవరో హ్యాక్ చేసి ఈ పనిచేసినట్లు భావించి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఎవరో తమ ఆన్‌లైన్ క్లాస్ లింక్‌ను హ్యాక్ చేసి పోర్న్ వీడియోను ప్రదర్శించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్‌లైన్ క్లాస్ లింక్‌ను హ్యాక్ చేసిన ఆ హ్యాకర్ క్లాస్ మొదలైన 40 నిమిషాల తర్వాత పోర్న్ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. జుహూ పోలీసులు ఆ హ్యాకర్ ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి శశికాంత్ మనె తెలిపారు. ఇలాంటి ఆకతాయిల వల్ల.. కరోనా కారణంగా విద్యార్థులకు వర్చువల్‌గా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం కాలేజీ యాజమాన్యాలకు పెద్ద తలనొప్పిగా మారింది. సరిగ్గా 15 రోజుల క్రితం ముంబైలోనే ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఓ మహిళా టీచర్ ఆన్‌లైన్‌లో క్లాసు చెబుతుండగా ఓ 15 ఏళ్ల విద్యార్థి తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ తప్పుగా ప్రవర్తించాడు. ఫేక్ నంబర్‌‌, ఈమెయిల్ అడ్రస్ ఉపయోగించి ఆ బాలుడు ఈ పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

    ఆ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ టీచర్‌కు తన ముఖం చూపించకుండా ఆ బాలుడు క్లాస్ జరుగుతుండగా ప్యాంట్ విప్పి అప్పుడప్పుడు తన ప్రైవేట్ పార్ట్స్ చూపించినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకూ ఆ విద్యార్థి ఇలా పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. పోలీసులు ఆ విద్యార్థి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    ఆన్‌లైన్ క్లాస్ వీడియో లింక్‌లో లాగిన్ అయ్యేందుకు ఫేక్ ఈమెయిల్ అడ్రస్ వినియోగించడం, ఐపీ అడ్రస్ దొరక్కుండా జాగ్రత్త పడటంతో పాటు ముఖం చూపించకుండా ఆ బాలుడు జాగ్రత్త పడటంతో ఆ పని చేసింది ఎవరనే విషయాన్ని ఆ టీచర్ గుర్తించలేకపోయింది. అయితే.. పలుమార్లు ఇలా చేయడంతో ఆమె తెలివిగా ఆలోచించి ఆ విద్యార్థి అలా ప్రవర్తిస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ కనిపిస్తున్న సందర్భంలో స్క్రీన్ షాట్ తీసింది. పోలీసుల విచారణలో ఆ స్క్రీన్ షాట్ ఎంతగానో ఉపకరించింది. పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి ఎందుకిలా చేశావని అడగ్గా.. ‘జస్ట్ ఫర్ ఫన్’ అని ఆ బాలుడి బదులివ్వడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: College student, Crime news, Online classes, Porn Movies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు