కొడుకు చనిపోతే ‘దినం’ భోజనాలు పెట్టలేదని గ్రామస్తుల దుశ్చర్య....

అసలే కొడుకుపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి.. కొడుకు చనిపోయిన దినం భోజనాలు పెట్టలేదని గ్రామస్తులు కోపం పెంచుకున్నారు. ఏకంగా ఊరి నుంచి వెలివేశారు.

news18-telugu
Updated: November 15, 2019, 10:32 PM IST
కొడుకు చనిపోతే ‘దినం’ భోజనాలు పెట్టలేదని గ్రామస్తుల దుశ్చర్య....
(ప్రతీకాత్మక చిత్రం ) Image;Reeuters
  • Share this:
కొడుకు చనిపోతే దినం భోజనం పెట్టలేదని కక్షతో గ్రామస్తులు ఏకంగా ఓ కుటుంబాన్నే వెలివేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల నుంచి వారిని ఊరి నుంచి వెలివేశారు. వారితో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు. ఎవరూ పని కూడా ఇవ్వడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలీ జిల్లాలో సంతన్ నిర్మాల్కర్ అనే వ్యక్తికి భార్య, ఐదుగురు పిల్లలు. వారిలో 20 ఏళ్ల కొడుకు 2016లో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అసలే కొడుకుపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి.. కొడుకు చనిపోయిన దినం భోజనాలు పెట్టలేదని గ్రామస్తులు కోపం పెంచుకున్నారు. ఏకంగా ఊరి నుంచి వెలివేశారు.

సంతన్ అతడి కుటుంసభ్యులు మూడేళ్ల నుంచి వారు గ్రామానికి బయటే ఉంటున్నారు. ఊళ్లో ఎవరూ వారితో మాట్లాడడం లేదు. ఎవరూ పని కూడా ఇవ్వడం లేదు. కూరగాయలు అమ్మేవారిని కూడా వారికి సరుకులు అమ్మితే వెలివేస్తామని బెదిరించారు. మూడేళ్ల నుంచి వేరే గ్రామం మీద ఆధారపడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విసిగిపోయిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. గ్రామస్తుల తీరు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈ ఒక్క సంతన్ మాత్రమే కాదని... సుమారు 25వేల మంది వరకు ఇలాంటి వెలివేతకు గురయ్యారని ఓ సామాజిక కార్యకర్త తెలిపారు.

హరీశ్ రావుకు సెగ.. మహిళ ఆత్మహత్యాయత్నంFirst published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>